Asianet News TeluguAsianet News Telugu

టీనేజ్ బాలికను కిడ్నాప్ చేసి, ఫ్యాక్టరీలో బంధించి అత్యాచారం.. వ్యక్తి అరెస్టు..

ఓ బాలికను కిడ్నాప్ చేసి రాత్రంతా అత్యాచారం చేశాడో వ్యక్తి.  గోరఖ్‌పూర్‌కు చెందిన అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేరంలో మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

man kidnaps, rapes teenage girl in factory In Gorakhpur, Arrested - bsb
Author
First Published Jun 1, 2023, 1:30 PM IST

గోరఖ్‌పూర్‌ : టీనేజ్ బాలికని కిడ్నాప్ చేసి, ఆమెను ఫ్యాక్టరీలో బందీగా ఉంచి, రాత్రంతా అత్యాచారం చేసినందుకు గోరఖ్‌పూర్ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు తప్పించుకుని మరుసటి రోజు ఉదయం తన ఇంటికి చేరుకుంది. నిందితుడిపై కేసు నమోదు చేసి, అనంతరం అరెస్టు చేశారు.

ఖోరాబర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుస్మి జంగిల్ ప్రాంతంలో మూతపడిన ఫ్యాక్టరీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడు రాజన్ రాజ్‌భర్‌గా గుర్తించారు. అతను గ్రామ పెద్ద యొక్క మేనల్లుడు. బాలికను కిడ్నాప్ చేసి, ఆమెను బందీగా ఉంచి, రాత్రంతా ఫ్యాక్టరీలో ఆమెపై అత్యాచారం చేశాడు.

మరుసటి రోజు ఉదయం అక్కడినుంచి ఎలాగో తప్పించుకున్న బాధితురాలు... తీవ్ర గాయాలైనప్పటికీ ఇంటికి చేరుకోగలిగింది. ఆమెను ఆ స్థితిలో చూసి కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. వారికి తన మీద జరిగి అఘాయిత్యాన్ని మొత్తం బాలిక వివరించింది. వెంటనే బాలిక బంధువులు ఆమెను జిల్లా ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి తరలించారు.

అదే సమయంలో జరిగిన ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు అందుకున్న ఖోరాబర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుడే కాకుండా మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్లో సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాధితురాలు కాలిన గాయాలతో గత రెండు నెలలుగా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం నాడు ప్రాణాలు విడిచింది. అత్యాచారానికి ఎదురు తిరగడంతో ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు దుర్మార్గులు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని జైసింగ్ పూర్ కు చెందిన ఓ విద్యార్థినిపై బహ్రీ గ్రామానికి చెందిన మహావీర్ అనే యువకుడు కన్నేశాడు. ఈ ఏడాది జనవరి 30న తన స్నేహితుల సహాయంతో ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తరువాత ఆ విద్యార్థినిని గుజరాత్ లోని సూరత్ కు తీసుకువెళ్లారు. మరోవైపు విద్యార్థిని కనిపించకపోవడంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.

మహావీర్ మీద అనుమానం ఉందని.. తన  కూతురు అదృశ్యానికి అతనికి సంబంధం ఉండొచ్చని తెలపడంతో.. అతను, అతని స్నేహితుల మీద.  పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మార్చి 28న మహావీర్ అతని స్నేహితులు ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు ఎదురు తిరిగింది. కోపానికి వచ్చిన నిందితుడు ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత ఈ విషయాన్ని విద్యార్థినిని కిడ్నాప్ చేసిన  మహా వీరే  స్వయంగా బాధితురాలు తండ్రికి ఫోన్ చేశాడు. అతని కూతురు తీవ్ర గాయాల పాలయిందని తెలిపాడు. దీంతో మార్చి 29న బాధితురాలు తండ్రి సుల్తాన్పూర్ ఎస్పీ సోమన్ వర్మను కలిసి.. ఘటన మొత్తాన్ని వివరించాడు.  దీంతో వెంటనే ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు సూరత్ వెళ్లారు. అక్కడ  మహావీర్ చెప్పిన గుర్తుల ప్రకారం బాధితురాలి ఆచూకీ కనుక్కుని.. ఆమెను లఖ్ నవూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా, నిందితుల కోసం పోలీసులు మూడు బృందాలుగా మారి గాలించారు.  వీరిలో ప్రధాన నిందితుడైన మహావీర్.. అతని స్నేహితుడైన ధనిరామ్ లను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అప్పటినుంచి  60 శాతానికి పైగా  కాలిన గాయాలతో బాధితురాలు చికిత్స పొందుతుంది. మంగళవారం రాత్రి  మృతి చెందింది. 

Follow Us:
Download App:
  • android
  • ios