స్మృతి ఇరానీ పర్యటనలో భద్రతా లోపం.. అప్రమత్తమైన సిబ్బంది.. అసలేం జరిగిందంటే..?
యూపీలోని రాయబరేలి (Raebareli)లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani)కాన్వాయ్ లో భద్రతా లోపం (Security Lapse) చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతన్ని అదుపులోనికి తీసుకున్నారు. అతని బాధేంటో కేంద్రమంత్రికి వెల్లబుచ్చారు.
కేంద్ర మంత్రి, అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ(Smriti Irani) శుక్రవారంనాడు రాయబరేలి (Raebareli)లో పర్యటించగా.. ఆ పర్యటనలో భద్రతా లోపం (Security Lapse) చోటుచేసుకుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియోజకవర్గంలో స్మృతి ఇరానీ పర్యటిస్తుండగా ఆమె కాన్వాయ్ ముందుకు ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి దూసుకెళ్లాడు.
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతన్ని అదుపులోనికి తీసుకున్నారు. ఉద్యోగం నుంచి తొలగించారనే బాధతో సదరు ఉద్యోగి తన జీవితాన్ని అంతం చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన తీవ్ర భయాందోళనకు గురి చేసింది. పోలీసులు వెంటనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. నగర పంచాయతీ పర్షాదేపూర్‌లో ఔట్‌సోర్సింగ్ కింద ఉంచిన 14 మంది ఉద్యోగులను తొలగించారు. దీంతో ఉద్యోగులంతా రోడ్డున పడ్డారు.
కేంద్రమంత్రి రాక సమాచారంతో ఆ ఉద్యోగులు కున్వర్ మౌ గ్రామానికి చేరుకున్నారు. మరోవైపు సలోన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చతోహ్ బ్లాక్‌లోని బెధౌనా గ్రామంలో బహిరంగ సంభాషణ కార్యక్రమాన్ని ముగించుకుని కేంద్ర మంత్రి కున్వర్ మౌ గ్రామానికి వెళ్తున్నారు. కున్వర్ మౌ గ్రామంలోని కార్యక్రమ వేదికకు కొంతదూరంలో అకస్మాత్తుగా ధీరేంద్ర కుమార్ అనే ఔట్ సోర్సింగ్ కార్మికుడు మంత్రి కారు ముందు దూకాడు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో కారు వేగం తక్కువగా ఉంది. అలాగే డ్రైవర్ వేగంగా బ్రేకులు వేసి కారు ఆపాడు.
ఈ ఘటనతో కున్వర్ మౌ గ్రామంలో గందరగోళం నెలకొంది. పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. వెంటనే ఉన్న పోలీసులు వెంటనే ధీరేంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని చూడటానికి కేంద్ర మంత్రి కారు దిగి వచ్చారు. అనంతరం ఆ ఉద్యోగి తన ఆవేదనను ఆలకించారు. తన పేరు ధీరేంద్ర అనీ, తాను ప్రయాగ్‌రాజ్ నివాసి అని చెబుతారు.
నగర పంచాయత్‌లో పనిచేస్తున్న తనని వ్యక్తి గత మే 5న ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారనీ, దీంతో తన కుటుంబం మొత్తం రోడ్డుపైన పడిందనీ, తనని ఆదుకోవాలని కేంద్ర మంత్రికి ప్రాధేయపడ్డారు. కాన్వాయ్‌కు అడ్డుపడిన అతనికి వెంటనే మెడికల్ చెకప్ చేయించమని స్మృతి ఇరానీ అధికారులను ఆదేశించారు. పరష్‌దేపూర్ నగర్ పంచాయత్‌లో పనిచేసే 14 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఇటీవల తొలగించగా, వారిలో ధీరేంద్ర సింగ్ కూడా ఉన్నాడని చెబుతున్నారు.