భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. భర్త క్వారంటైన్ లో ఉంటే భార్య ప్రియుడితో లేచిపోయింది. తన భార్య ప్రియుడితో లేచిపోయిందని క్వారంటైన్ లో ఉన్న ఓ వలస కూలీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛత్రపూర్ జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ఆమె కోసం గాలిస్తున్నారు. ఆమెకు 46 ఏళ్ల వయస్సు ఉంటుంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. 50 ఏళ్ల వయస్సు గల వలస కూలీ మే 19వ తేదీన ముందేరీ గ్రామానికి తిరిగి వచ్చాడు. 

ఢిల్లీలో భవన నిర్మాణ పనులు చేసేవాడు. ఏడాదిన్నర దాకా కుటుంబ సభ్యులు అతనితో ఉండేవారు. ా తర్వాత పిల్లలతో కలిసి గ్రామానికి తిరిగి వచ్చింది. శ్రామిక్ రైలులో అతను గ్రామానికి వచ్చాడు. అతని 14 రోజుల క్వారంటైన్ మధ్యలో చూడగా అతనికి భార్య కనిపించలేదు.

తాను తొలి అంతస్థులో క్వారంటైన్ లో ఉండగా, భార్యాపిల్లలు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటూ వస్తున్నారని, ఈ నెల 24వ తేదీన తన గదికి బయటి నుంచి తాళం వేసి ఉందని అనతు చెప్పాడు. 

కష్టపడి బయటకు వచ్చి చూస్తే భార్య కనిపించలేదని, పిల్లలు తమకేమీ తెలియదని చెప్పారని అతను తన ఫిర్యాదులో చెప్పాడు. తన భార్య కోసం ఇంటింటికీ వెళ్లి వాకబు చేసినా ఫలితం లేకపోయిందని చెప్పాడు.