సారాంశం

కేరళలోని పూజపురా సెంట్రల్ జైల్ (Poojappura Central Jail) లో ఓ వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. మటన్ కొంచమే పెట్టారని జైలర్లపై దాడి చేశాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

కేరళలోని ఓ జైల్ లో ఓ వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. జైలులో మటన్ కొంచమే పెట్టారని ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. జైలు అధికారులపై విరుచుకుపడ్డాడు. జైలర్ పై కూడా దాడి చేశాడు. ఈ ఘటన పూజపురా సెంట్రల్ జైల్ (Poojappura Central Jail)లో చోటుచేసుకుంది.  జైలు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.నిందితుడి ఫైజాస్.. వయానాడ్ కు చెందిన ఫైజాస్ డ్రగ్స్ కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

విషయం ఏమిటి?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షెడ్యూలులో భాగంగా జైలులో శనివారం సాధారణంగా ఖైదీలకు మంసాహారం వడ్డిస్తారు. ఈ శనివారం మెనులో భాగంగా ఖైదీలందరికీ మటన్ కర్రీ వండించారు. అయితే.. తనకు తక్కువగా పెట్టారని డ్రగ్స్ కేసులో శిక్ష అనుభవిస్తున్న  ఫైజాస్ వాగ్వాదానికి దిగారు.  అతను జైలులో రచ్చ సృష్టించడం ప్రారంభించాడు. వడ్డించిన మటన్‌ను చెత్తబుట్టలో విసిరాడు. ఈ క్రమంలో ఫైజాస్.. డిప్యూటీ సూపరింటెండెంట్ తో పాటు పలువురు సీనియన్ జైలు అధికారులపై దాడికి దిగాడు దాడికి దిగాడు.ఇంతకుముందు కూడా పలు జైళ్లలో ఇలాంటి గొడవలు సృష్టించిన అతడ్ని ప్రస్తుతం ప్రత్యేక వార్డుకు మార్చారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో శిక్ష అనుభవిస్తున్న అతడిపై ఇప్పుడు మరో కేసు పెట్టామని పోలీసులు చెప్పారు.