భారీ మొత్తంలో నగదును మెట్రోరైలులో తరలిస్తున్నాడో వ్యక్తి. రూ.29 లక్షలను  అనుమానాస్పదంగా తీసుకువెళుతుండగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు జవాన్లు పట్టుకున్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. 

ఘజియాబాద్ నగరానికి చెందిన దీపక్ కుమార్ (28) రూ.28లక్షల నగదుతో మజ్లిస్ పార్కు స్టేషనులో మెట్రోరైలు ఎక్కాడు. తాను చాందినీచౌక్ ప్రాంతంలోని ఓ ట్రేడింగ్ కంపెనీలో పనిచేస్తున్నానని, తాను వ్యాపార పనిమీద రూ.29లక్షలను బ్యాగులో తీసుకువెళుతున్నానని దీపక్ కుమార్ చెప్పారు. 

నగదును అనుమానాస్పదంగా తీసుకువెళుతుండగా అతన్ని పట్టుకొని నగదును స్వాధీనం చేసుకున్నామని సీఐఎస్ఎఫ్ జవాన్లు చెప్పారు. నగదుతోపాటు దీపక్ కుమార్ ను ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అప్పగించామని సీఐఎస్ఎఫ్ అధికారులు వివరించారు.