Delhi Airport:  దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 15ల‌క్ష‌లు విలువ చేసే.. యుఎస్ డాలర్లను ఎయిర్ పోర్ట్ భ‌ద్ర‌తా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

Delhi Airport: అక్ర‌మ ర‌వాణాను అరికట్టేందుకు కస్టమ్స్‌ అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. అక్రమార్కులు ఏమాత్రం తగ్గడం లేదు. సినిమాల్లో చూపించే విధంగానే విభిన్న మార్గాల్లో అక్రమంగా రవాణా చేస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ షాకింగ్ ఘ‌ట‌న‌ వెలుగులోకి వచ్చింది. 

భార‌త్ నుంచి బ్యాంకాక్ నుండి వెళ్తున్న ఓ ప్ర‌యాణీకుడి నుంచి.. కరకరలాడే అప్ప‌డాల ప్యాకెట్ల‌ను, మసాల ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్య‌క్తిని అరెస్ట్ చేశారు. అప్ప‌డాలు ప్యాకెట్లు, మసాల ప్యాకెట్లు తీసుకెళ్తే త‌ప్పేంటీ? అందులో త‌ప్పేముంద‌ని ఆలోచిస్తున్నారా? ఇక్క‌డ స‌వాల్ విష‌యం ఉంది.. పోలీసులు గుర్తించ‌కుండా.. ఓ వ్య‌క్తి .. అప్ప‌డాల‌ ప్యాకెట్ల మ‌ధ్య‌లో 15 లక్షల రూపాయల కంటే ఎక్కువ విలువైన యుఎస్ డాలర్లను తీసుకెళ్లినందుకు అరెస్టు చేసినట్లు సిఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-III వద్ద ఓ ప్రయాణీకుడిపై భద్రతా సిబ్బందికి అనుమానం రావ‌డంతో అత‌న్ని వెంట‌నే ఆపారు. తనిఖీ చేయగా.. అత‌ని బ్యాగులో అప్ప‌డాల ప్యాకెట్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆ ప్యాకెట్ల‌ను విప్పి చూడ‌గా.. యూఎస్ కరెన్సీని బ‌య‌ట‌ప‌డింది.

వాస్తవానికి రిషికేశ్ అనే వ్యక్తి విమానాశ్రయంలోని టెర్మినల్-III వద్ద అనుమాన‌స్ప‌దంగా తిరుగుతుండ‌టంతో నిందితుడి లగేజీని తనిఖీ చేయగా, లగేజీలో దాచిన విదేశీ కరెన్సీ బ‌య‌ట‌ప‌డింది. ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారులు, కస్టమ్స్ శాఖ అధికారులకు తెలియ‌జేశారు. ఈ క్ర‌మంలో అరెస్టు చేసిన ప్రయాణీకుడి నుండి మొత్తం $ 19,900 US డాలర్లు పట్టుబడ్డాయి. భారతీయ రూపాయల ప్రకారం దాదాపు 15న్నర లక్షల రూపాయల‌ని అంచ‌నా. నిందితుడిని కస్టమ్స్ అధికారులు అదుపులో తీసుకున్నారు. 

అదే సమయంలో రిషికేశ్ అనే వ్యక్తి విస్తారా విమానం నంబర్ యూకే-121లో బ్యాంకాక్ వెళ్తున్నాడు. అటువంటి పరిస్థితిలో CISF అతనిని ఆపి అతని బ్యాగ్‌ను సోదా చేయగా.. బ్యాగ్‌లోని అప్పాడాల‌ ప్యాకెట్ మధ్యలో దాచిపెట్టిన 19 వేల 900 US డాలర్లు రికవరీ చేయబడ్డాయి. వీరి ధర దాదాపు 15న్నర లక్షల రూపాయలు. ఈ విచారణలో రిషికేశ్ సరైన వివ‌ర‌ణ‌ ఇవ్వలేకపోయాడు. కస్టమ్స్ అధికారులు నిందితుడిని అదుపులో తీసుకున్నారు.