జల్పాయిగురి : పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలో దారుణం జరిగింది. అక్కాచెల్లెళ్లైన ఇద్దరు మహిళలపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ ఘటనలో అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పశ్చిమ బెంగాల్‌, కూచ్ బెహార్ జిల్లాలోని అదాబరి ఘాట్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని న్యూ జల్పాయిగురి పోలీస్ స్టేషన్ అధికారులు గురువారం రాత్రి పట్టుకున్నారు.

మరో నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు, అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

అక్కాచెల్లెళ్లైన వీరిద్దరినీ మే 11 న నిందితుడు ఓ గదికి పిలిచారు. అక్కడ వారి మీద అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు న్యూ జల్పాయిగురి పోలీస్ స్టేషన్లో నిందితులపై మహిళల కుటుంబం ఫిర్యాదు చేసింది.

నిందితుడిని శుక్రవారం స్థానిక కోర్టులో హాజరుపరిచారు. అయితే బాధితులు ఎవరనేది పోలీసులు గోప్యంగా ఉంచారు. లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, బాధితుల సెక్యూరిటీ దృష్ట్యా వారి వివరాలు గోప్యంగా ఉంచారు.