యూట్యూబ్ లో చూస్తూ ఓ యువకుడు.. తాను ప్రేమించిన అమ్మాయికి డెలివరీ చేయాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో కడుపులోని బిడ్డ కన్నుమూయగా.. సదరు యువతి ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడులోని గుమ్మిడిపూండికి చెందిన సౌందర్(27) ఓ ప్రైవుట్ గ్యాస్ ఎజెన్సీలో సిలిండర్లు సరఫరా చేస్తుంటాడు. ప్రేమ పేరుతో ఓ యువతిని తన వలలో వేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతికి శారీరకంగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో సదరు యువతి గర్భం దాల్చింది.

Also Read మైనర్ బాలుడితో ఆంటీ ఎఫైర్... రాత్రంతా శృంగారం, తృప్తితీరక..

అయితే.. ఆమె శరీరంలో వస్తున్న మార్పులను ఆమె తల్లిదండ్రులు గమనించారు. ఏంటి అని ఆరాతీయగా.. తనకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదని ఏవేవో సాకులు చెప్పి తప్పించుకుంది. ఈ క్రమంలోనే యువతికి ఎనిమిది నెలలు నిండాయి.

బుధవారం నొప్పలు  రావడం మొదలయ్యాయి. దీంతో వెంటనే తన ప్రియుడు సౌందర్ వద్దకు వెళ్లింది. వెంటనే అతను గ్లౌజులు, కత్తెర, బ్లేడు వంటి సామాగ్రిని కొనుగోలు చేశాడు. అనంతరం యువతిని తన బైక్ పై సమీపంలోని ఓ అడవికి తీసుకువెళ్లాడు. అక్కడ సెల్ ఫోన్ లో యూట్యూబ్ లో డెలివరీ ఎలా చేయాలో వీడియో ఓపెన్ చేశాడు.

దాంట్లో చూస్తూ.. యువతికి ప్రసవం చేయడానికి ప్రయత్నించాడు ఈ క్రమంలో బ్లేడ్ తో ఆమె పొట్టని కోశాడు. ఆ సమయంలో.. కడుపులోని బిడ్డ చెయ్యి తెగిపోయింది. ఆమె పేగు కూడా తెగి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో.. యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

ఇక లాభం లేదని భావించి వెంటనే యువతిని అతి కష్టం మీద సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడి వైద్యులు యువతికి సర్జరీ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే.. ఆ బిడ్డ రక్తస్రావమై చనిపోయింది. యువతిని మాత్రం డాక్టర్లు కాపాడగలిగారు. కాగా.. వైద్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు సౌందర్ ని అరెస్టు చేశారు.