Asianet News TeluguAsianet News Telugu

ఆలస్యాన్ని సహించని భర్త.. 10 నిమిషాలు లేటైనందుకు తలాక్

ముస్లిం మహిళల జీవితాలను బలి తీసుకుంటున్న ట్రిపుల్ తలాక్‌పై కేంద్రప్రభుత్వం బిల్లు తీసుకొచ్చినప్పటికీ దేశంలో చిన్న చిన్న విషయాలకే భార్యలకు విడాకులు ఇస్తున్న ఘటనలు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా కేవలం 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందన్న కారణం చేత భార్యకు తలాక్  చెప్పాడు

man gives triple talaq to his wife in up
Author
Uttar Pradesh, First Published Jan 30, 2019, 12:01 PM IST

ముస్లిం మహిళల జీవితాలను బలి తీసుకుంటున్న ట్రిపుల్ తలాక్‌పై కేంద్రప్రభుత్వం బిల్లు తీసుకొచ్చినప్పటికీ దేశంలో చిన్న చిన్న విషయాలకే భార్యలకు విడాకులు ఇస్తున్న ఘటనలు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా కేవలం 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందన్న కారణం చేత భార్యకు తలాక్  చెప్పాడు ఓ భర్త.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన ఓ మహిళ తన నానమ్మను చూడటానికి భర్త అనుమతితో పుట్టింటికి వెళ్లింది. వెళ్లే ముందు సరిగ్గా అర్ధగంటలో ఇంట్లో ఉండాలని హెచ్చరించాడు. పుట్టింటికి వెళ్లి భర్త చెప్పిన సమయానికి ఆమె 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది.

అంతే బాధితురాలి భర్త ఆమె సోదరునికి ఫోన్ చేసి మూడు సార్లు తలాక్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న బాధితురాలు కుటుంబసభ్యుల సాయంతో న్యాయం కోసం అత్తారింటికి వచ్చింది. దీంతో ఆమెను ఇంట్లో నుంచి గెంటేశారు.

న్యాయం కోసం సదరు మహిళ తన భర్త, అత్త మామల మీద కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసింది.

పెళ్ళయిన నాటి నుంచి తనను అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని తెలిపింది. తన తల్లిదండ్రులు పేదవారని ఉన్నంతలో ఘనంగానే పెళ్లి చేశారని చెప్పింది. కట్నం కోసం తనను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా.. ఇప్పటికే ఒకసారి అబర్షాన్ సైతం చేయించారని తెలిపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios