Asianet News TeluguAsianet News Telugu

బాబోయ్.. పిజ్జాలో గాజు ముక్కలు.. తింటుంటే పంటికిందికి.. కస్టమర్ కు చేదు అనుభవం..

మహారాష్ట్రలో ఓ కస్టమర్ కి చేదు అనుభవం ఎదురయ్యింది. పిజ్జాలో గాజు ముక్కలు రావడంతో అతను ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు.  

man finds glass shards in Domino's pizza In Maharashtra
Author
First Published Oct 10, 2022, 12:18 PM IST

మహారాష్ట్ర : ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం  ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది.  హోటల్స్, రెస్టారెంట్స్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా  ఉన్నచోటు నుండే కావాల్సిన ఆహారాన్ని చిటికెలో ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు ఇది ఇబ్బందుల్లో పడేస్తుంది. డెలివరీ బాయ్స్ మీద దాడి చేయడం, కస్టమర్ మీద డెలివరీ బాయ్స్ దాడి చేయడం లాంటి ఘటనలు అక్కడక్కడ వింటూనే ఉన్నాం. దీంతోపాటు తీసుకువచ్చే  ఆహారాన్ని డెలివరీ బాయ్స్ తినేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.  అయితే తాజాగా  డొమినోస్ నుండి పిజ్జా ఆర్డర్ చేసిన ఒక కస్టమర్ కు  చేదు అనుభవం ఎదురయింది. 

పిజ్జా లో ఏకంగా గాజు ముక్కలు రావడంతో కస్టమర్ షాక్ అయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ కస్టమర్ డొమినోస్ నుండి పిజ్జా ఆర్డర్ పెట్టాడు. దీంతో, జొమాటో నుంచి సదరు కస్టమర్ పిజ్జాను అందుకున్నాడు. ఎంతో ఇష్టంగా పిజ్జా తినడానికి రెడీ అయిపోయాడు. కవర్ ఓపెన్ చేసి పిజ్జా తింటున్న సమయంలో మొదటిసారిగా ఒక గాజు ముక్క తగిలింది. దీంతో షాక్ అయ్యాడు.  అయితే చిన్న మిస్టేకే కదా అని లైట్ తీసుకున్నాడు. తినడం కంటిన్యూ చేశాడు.. ఇంతలో మరో రెండు గాజు ముక్కలు పంటికి తగిలాయి. దీంతో చిర్రెత్తిపోయిన అతను కోపంతో వెంటనే ఫోన్ తీసి పిజ్జా ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ట్ర‌క్కును ఢీ కొన్న ఖ‌డ్గ‌మృగం.. డ్రైవ‌ర్ కు భారీ జ‌రిమానా.. అస్సాం సీఎం ట్వీట్ వైర‌ల్

ఆ తర్వాత తనకు జరిగిన చేదు అనుభవం గురించి పోలీసులను ఆశ్రయించాడు. ట్విట్టర్ వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుపై పోలీసులు స్పందిస్తూ ముందుగా కస్టమర్ కేర్ కు ఫిర్యాదు చేయండి.. ఒకవేళ వారు స్పందించకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి అంటూ సలహా ఇచ్చారు. ఇక ఈ ఘటనపై డోమినోస్ సంస్థ స్పందించింది. డొమినోస్ తరఫున కస్టమర్ కు క్షమాపణలు తెలిపారు.  దీనిపై సమగ్ర విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఫుడ్ లో నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. కాగా, తమ తనిఖీల్లో రెస్టారెంట్లో ఎలాంటి గాజు సామాగ్గ్రిని కనుగొనలేదని స్పష్టం చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios