సూరత్: పెళ్లి తర్వాత కూడ లైంగిక సంబంధం కొనసాగించనని చెప్పడంతో మేన కోడలితో ఏకాంతంగా గడిపిన వీడియోలను కుటుంబసభ్యులకు పంపి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రకు చెందిన ఓ యువతి  సూరత్ లోని పూనా ప్రాంతంలో చీరలపై లేస్ వర్క్ చేస్తూ జీవినం గడుపుతోంది. ఈ పనిని ఆమెకు మేనమామ నేర్పించాడు.

 ప్రతి రోజూ ఆ యువతి మేనమామ ఇంటికి వచ్చిపోయేది. దీంతో వీరిద్దరి మద్య ప్రేమ చిగురించింది. అతడిని నమ్మి ఆమె అతడితో ఏకాంతంగా గడిపింది. యువతితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను ఆ వ్యక్తి సెల్‌ఫోన్ లో రికార్డు చేశాడు.

also read:నగ్నచిత్రాలు పంపాలని మహిళలకు వేధింపులు: యువకుడి అరెస్ట్

యువతికి కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకొన్న యువతి మేనమామ పెళ్లి చేసుకొన్న తర్వాత కూడ తనతో లైంగిక సంబంధం కొనసాగించాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. అప్పటి నుండి అతడికి దూరంగా ఆమె ఉంటుంది. దీంతో ఆమెపై నిందితుడు కోపం పెంచుకొన్నాడు.

వారిద్దరు ఏకాంతంగా గడిపిన వీడియోను యువతి తండ్రితో పాటు, బంధువులకు వీడియోను షేర్ చేశాడు. అనంతరం యువతిని మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. దీంతో యువతి తండ్రి సూరత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.