దెయ్యాలు వెంటాడుతున్నాయని ఓ వ్యక్తి చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. ఒంటి మీద దుస్తులు మొత్తం తీసేసి... బావిలోకి దూకేశాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని కన్నియకుమారి జిల్లా పుదిక్కడై సమీపంలోని ఐరేరిపురం అయనివిలై ప్రాంతంలో నాగదేవి ఆలయం ఉంది. శుక్రవారం ఉదయం ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వచ్చిన పూజారికి ప్రాంగణం లోని బావి నుంచి కేకలు వినిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా లోపలి నుంచి ఓ వ్యక్తి రక్షించాలని కోరాడు.

 35 అడుగుల తోతున్న ఆ బావిలో ప్రస్తుతం ఒక అడుగు మాత్రమే నీరుంది. ఆ నీటిలోనే ఓ వ్యక్తి ఒంటిపై దుస్తులు లేకుండా కూర్చొని ఉన్నాడు. అందిన సమా చారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని వల సాయంతో బావిలో పడిన వ్యక్తిని వెలికితీశారు. అతడికి స్వల్పగాయాలవడంతో కుళిత్తురై ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

అక్కడ పో లీసులు చేపట్టిన విచారణలో... అతడు అయనివిలైకు చెందిన కూలీ స్టీఫెన్‌ అని, గురువారం రాత్రి నిద్రించిన సమయంలో, తనను మూడు దయ్యాలు వెంటాడుతున్నట్లు కల వచ్చిందని, దీంతో దెయ్యాల నుంచి తప్పించుకొనేందుకు బావిలో దూకినట్లు స్టీఫెన్‌ పోలీసులకు తెలిపాడు. అతడి తీరును అనుమానించిన పోలీసులు విచారణ చేపట్టారు