గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్ లో వజ్రాల వ్యాపారిని మోసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు, రూ. 32 లక్షల విలువైన వజ్రాలను గుట్కా ప్యాకెట్లతో రీప్లేస్ చేసి మోసానికి పాల్పడ్డాడు.

గుజరాత్‌ : వజ్రాలని చెప్పి గుట్కా ప్యాకెట్లు ఇచ్చి గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. వజ్రాల వ్యాపారిని రూ. 32 లక్షలకు మోసం చేసిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రహీల్ మంజని అనే నిందితుడు తనను తాను డైమండ్ బ్రోకర్‌గా పరిచయం చేసుకున్నాడు. రుషబ్ వోరా అనే వజ్రాల వ్యాపారి కార్యాలయం నుంచి రూ.32.04 లక్షల విలువైన పాలిష్డ్, సహజ నాణ్యత కలిగిన వజ్రాలను తీసుకున్నాడు. 

వాటిని మరో వ్యాపారికి విక్రయిస్తానని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత బ్రోకర్ ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 21ల మధ్య మూడు సీల్డ్ పార్శిళ్లలో రూ.32.04 లక్షల విలువైన వజ్రాలను తీసుకొచ్చి ఇచ్చాడు. దీనికిగానూ రుషబ్‌కు టోకెన్ మనీగా రూ.2 లక్షలు ఇచ్చాడని రుషబ్ వోరా మహీధరపర పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఫిర్యాదులో తెలిపారు.

హత్య కేసులో దోషి, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ విడుదల.. బీహార్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు..

మూడు, నాలుగు రోజుల్లో మిగిలిన డబ్బు చెల్లించి వాటిని తీసుకుంటానని నిందితుడు చెప్పాడని రుషబ్ చెప్పాడు. అయితే, రోజులు గడుస్తున్నా మిగిలిన డబ్బు చెల్లించకపోవడంతో వోరా బ్రోకర్ ఇచ్చిన పార్శిళ్లను తెరిచి చూడగా వజ్రాలకు బదులు గుట్కా ప్యాకెట్లు కనిపించాయి.

వజ్రాల స్థానంలో గుట్కా ప్యాకెట్లను అమర్చేందుకు నిందితులు మరో వజ్రాల వ్యాపారితో కలిసి కుట్ర పన్నాడని ఆరోపించారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 420, 409 కింద మోసం.. నేరపూరిత విశ్వాస ఉల్లంఘన అభియోగాలు మోపబడ్డాయి. పోలీసు నివేదికల ప్రకారం, ఇతర వ్యాపారులకు ఈ స్కామ్‌లో ప్రమేయం ఉందో లేదో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోంది.