ట్రక్కు బోల్తా: నేలపాలైన పాల కోసం కుక్కలు, వ్యక్తి ఇలా...

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో తాజ్ మహల్ కు ఆరు కిలోమీటర్ల దూరంలో  సోమవారం నాడు పాల వ్యాన్ బోల్తా పడింది. అయితే ఈ పాలను మట్టి కుండలో ఎత్తుకొనేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే ఈ పాలను కుక్కల గుంపు జుర్రుకొన్నాయి.
Man Dogs Sharing Spilt Milk In Agra Shows Lockdown Desperation
ఆగ్రా: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో తాజ్ మహల్ కు ఆరు కిలోమీటర్ల దూరంలో  సోమవారం నాడు పాల వ్యాన్ బోల్తా పడింది. అయితే ఈ పాలను మట్టి కుండలో ఎత్తుకొనేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. 

తాజ్ మహల్ కు ఆరు కిలోమీటర్ల సమీపంలో  భారీ పాల వ్యాన్ బోల్తా పడింది. దీంతో పాలన్నీ నేలపాలయ్యాయి. అసలే లాక్ డౌన్ కారణంగా నిత్యావసర సరుకుల కోసం కష్టాలు పడుతున్నవారు ఉన్నారు.

ఈ పాలను దక్కించుకోవాలని ఓ వ్యక్తి ప్రయత్నించాడు. నేలపాలైన పాలను ఓ వ్యక్తి మట్టికుండలో చేతులతో ఎత్తిపోసుకొనేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో కుక్కలు కూడ పాలను జుర్రుకొన్నాయి.

కమల్ ఖాన్ అనే వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీసి ట్విట్టర్ లో పోస్టు చేశారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులకు ఈ వీడియో అద్దం పడుతుందని పలువురు వ్యాఖ్యానించారు.

also read:బెంగాల్‌లో లాక్‌డౌన్ అమలులో అధికారుల వైఫల్యం, తొలగించాలి: గవర్నర్ సీరియస్

లాక్ డౌన్ కారణంగా దేశంలోని పలు చోట్ల ఉన్న వలసకూలీలు తమ స్వగ్రామాలకు తిరిగివెళ్లేందుకు అష్టకష్టాలుపడ్డారు. మరోవైపు కొందరు తమ స్వగ్రామాలకు వెళ్లే పరిస్థితులు లేని కారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్యాంపుల్లో ఉన్నారు. 

లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగించడంతో రోజు వారీ కూలీలు ఆందోళన చెందుతున్నారు. అయితే వలసకూలీలు ఇబ్బందిపడ్డవద్దని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడ కోరిన విషయం తెలిసిందే.
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios