Asianet News TeluguAsianet News Telugu

జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడు..

జిమ్‌లో వర్కవుట్ చేస్తూ ఓ యువకుడు హఠాత్తుగా కుప్పకూలాడు. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది.

Man dies of heart attack while running on treadmill in Ghaziabad gym KRJ
Author
First Published Sep 17, 2023, 2:35 AM IST | Last Updated Sep 17, 2023, 2:35 AM IST

పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్‌లో వర్కవుట్ చేస్తూ హఠాత్తుగా మరణించిన ఘటనలు సర్వసాధారణం అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా రోజురోజుకూ పెరుగుతున్న ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఇలాంటి భయానక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లోని ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతి విహార్ ప్రాంతంలోని వార్డు-26లో నివసిస్తున్న సిద్ధార్థ్ అనే యువకుడు సమీపంలోని జిమ్‌కు వెళ్లాడు. ఉదయం 10 గంటల ప్రాంతంలో జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌పై నడుస్తుండగా.. సడెన్ గా ఆ యువకుడికి గుండెపోటు వచ్చింది. అక్కడ ఉన్న యువకులకు ఏమీ అర్థం కాకముందే.. అతడు అక్కడే పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

వీడియో వైరల్  

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో కూడా బయటకు వచ్చింది. తొలుత సిద్దార్థ ట్రెడ్‌మిల్ మీద వేగంగా నడుస్తున్నాడు. ఆరోగ్యం క్షీణించిన వెంటనే సిద్ధార్థ్ స్పీడ్ ట్రెడ్‌మిల్‌పై పడిపోయాడు. అక్కడే జిమ్ లో యువకులు వచ్చి పరిశీలించడం కూడా సిసిటివి ఫుటేజీని చూస్తుంటే స్పష్టమైంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios