మేనకోడలి పెళ్లిలో సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలిపోయి మరణించాడు. హార్ట్ ఎటాక్ అతని ప్రాణాలు తీసింది. 

ఛత్తీస్ గఢ్ : ఛత్తీస్ గఢ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన మేనకోడలి పెళ్లిలో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి పోయాడు. హార్ట్ ఎటాక్ రావడంతో మృతి చెందాడు. అతని పేరు దిలీప్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ ఘటన రాజ్ నంద్ గావ్ జిల్లా డోంగర్ ఘర్ లో చోటు చేసుకుంది. 

వేదికమీద వధూవరులతో కలిసి కొంతమంది నృత్యం చేస్తున్నారు. వధువు మేనమామ అయిన దిలీప్ కూడా వారితో కలిసి ఎంతో సంతోషంగా నృత్యం చేస్తున్నాడు. ఇంతలో ఆయనకు ఛాతిలో ఏదో తేడాగా అనిపించడంతో డ్యాన్స్ ఆపి వేదిక మీదే కూర్చున్నాడు. సెకన్లలో అలాగే వెనక్కి పడిపోయాడు. అది చూసిన మిగతావారు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు తేలింది. హార్ట్ ఎటాక్ వల్లే చనిపోయారని వైద్యులు తెలిపారు.

ఇదేం సరదా.. వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ లో కంప్రెషర్ పంపుతో గాలి కొట్టిన స్నేహితుడు.. తరువాత ఏం జరిగిందంటే ?

అప్పటివరకు ఎంతో సంతోషంగా పెళ్లి వేడుక జరుగుతున్న ప్రాంగణంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే, ఈ ఘటన మే 4- 5 మధ్య రాత్రి జరిగింది. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డయ్యింది. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.