ప్రియురాలితో గొడవపడ్డ టెక్కీ.. కట్ చేస్తే.. 20వ ఫ్లోర్ నుంచి జంప్
నోయిడాలోని గోల్డెన్ పామ్ సొసైటీ సెక్టార్-168లో నివసిస్తున్న యువకుడు (25) శుక్రవారం రాత్రి బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎక్స్‌ప్రెస్‌వే కొత్వాలి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రియురాలితో గొడవపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. థానా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతంలోని సెక్టార్-168లో ఉన్న గోల్డెన్ పామ్ సొసైటీలో తన ప్రియురాలితో కలిసి నివసించేందుకు వచ్చిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శుక్రవారం అర్థరాత్రి 20వ అంతస్తులోని బాల్కనీ నుంచి దూకాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎక్స్‌ప్రెస్‌వే కొత్వాలి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ విషయమై మృతుడి ప్రియురాలిని విచారిస్తున్నారు.
వివారాల్లోకెళ్తే.. ఆత్మహత్య చేసుకున్న యువకుడిని హర్యానాలోని సోనిపత్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల నమన్ మదన్‌గా గుర్తించారు. సెక్టార్-15 సోనెపట్‌లో నివాసముంటున్న నమన్ మదన్ కుమారుడు అనిల్ మదన్ బెంగళూరులోని వివాన్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని స్టేషన్ ఎక్స్‌ప్రెస్ వే ఇన్‌ఛార్జ్ సుధీర్ కుమార్ తెలిపారు. అతను గోల్డెన్ పామ్ సొసైటీలో అద్దెకు ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. తన స్నేహితురాలితో కలిసి గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఓ టవర్ స్టూడియో అపార్ట్‌మెంట్‌లో బస చేసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో తన స్నేహితురాలితో గొడవకు దిగాడు. ‘నేను నీతో రోజంతా సంతోషం గడపాలి అనుకున్నా.. కానీ, నువ్వు నీ స్నేహితురాలిని ఎందుకు పిలిచావు?’’ అంటూ ఆమెపై అరిచాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే తాను అపార్ట్ మెంట్ నుంచి దూకి చనిపోతానని అనిల్ మదన్ బెదిరించాడు. దీంతో ఆ యువతి భయపడింది. వెంటనే ఆ అమ్మాయి కింద సెక్యూరిటీ గార్డుని అలర్ట్ చేయడానికి వెళ్లింది. కానీ.. ఆ యువకుడు అన్న పని చేసుకున్నాడు. ఆ అపార్ట్‌మెంట్‌లోని 20వ ఫ్లోర్ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నేలపై పడిపోవడంతో తలకు గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. యువతితో మనస్పర్థలు రావడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు బాలికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మృతుడు మదన్ ప్రియురాలు కూడా సోనిపట్ వాసి అని ప్రాథమిక విచారణలో తేలిందని స్టేషన్ ఇన్‌ఛార్జ్ చెప్పారు. ఇద్దరూ బ్యాచ్‌మేట్స్. మదన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు మదన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే ప్రియురాలి సమక్షంలోనే ఈ ఘటన జరగడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.