మహిళపై పెట్రోల్ పోసి చంపాలని ప్రయత్నించిన వ్యక్తి తానే మంటల్లో కాలి చనిపోయాడు. బాదిత మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటన ముంబైలో శనివారం జరిగింది. దీనిమీద బాధిత మహిళ సోదరుడు మేఘవాడి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. జోగేశ్వరిలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన విజయ్ ఖంబేకు అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో రెండున్నరేల్లుగా పరిచయం ఉంది. విజయ్ ఆ మహిళను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఇదే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపాడు.
ఇందుకు ఆ మహిళ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో విజయ్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విజయ్ ఆమె ఇంటికి వెళ్లి సదరు మహిళపై వెనక నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
వెంటనే మహిళ విజయ్ ను గట్టి పట్టుకుంది. దీంతో అతనికి కూడా మంటలు అంటుకున్నాయి. విజయ్ గట్టిగా అరవడంతో ఆ కేకలకు చూట్టుపక్కల వారు వచ్చి చూడగా, వారిద్దరూ మంటల్లో కాలుతూ కనిపించారు. వారు వెంటనే మంటలు ఆర్పి స్థానిక ఆస్పత్రిలో చేర్చించారు.
అయితే చంపుదామని వెళ్లిన విజయ్ కే ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో అతడు మృతి చెందాడు. బాధిత మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
దీనిపై మేఘవాడి సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. బాధిత మహిళ సోదరుడి ఫిర్యాదు మేరకు మృతుడు విజయ్ మీద కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెల్లడి కావాల్సి ఉందని, ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్లు తెలిపారు.