తూర్పు ఢిల్లీలోని బ్లూ లైన్‌లో ఉన్న మయూర్ విహార్-1 మెట్రో స్టేషన్ వద్ద ఆదివారం కదులుతున్న రైలు ముందు దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది గమనించిన వారు ఆ వ్యక్తిని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు.
ఢిల్లీ : తూర్పు ఢిల్లీలోని బ్లూ లైన్‌లో ఉన్న మయూర్ విహార్-1 మెట్రో స్టేషన్ వద్ద ఆదివారం కదులుతున్న రైలు ముందు దూకి "మానసిక పరమైన అనారోగ్యంతో" బాధపడుతున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అజయ్ లక్ష్మణ్ పఖాలే అనే వ్యక్తి మృతుడిగా గుర్తించారు. ఆయన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)లో మాజీ సీనియర్ మేనేజర్ గా పనిచేశారు. అజయ్ లక్ష్మణ్ పఖాలే స్టేషన్ ప్లాట్‌ఫాం నెం. 1 నుంచి ట్రైన్ ముందుకు దూకారని చూసిన వారు చెప్పారు. ఈ సంఘటన కారణంగా కారిడార్‌లోని ఇతర రైళ్లు కాస్త ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి.
అయితే, ఒక అజ్ఞాత ప్రయాణికుడు అభ్యర్థిస్తూ, "నేను నోయిడా సెక్టార్ 18 స్టేషన్ నుండి రాజీవ్ చౌక్ స్టేషన్ కు వెళ్లాలి. దీనికోసం మధ్యాహ్నం 1.50 గంటలకు రైలు ఎక్కాను, కాని అది నోయిడా సెక్టార్ 16 వద్ద తదుపరి స్టేషన్‌లో ఆగిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత, రైలు ముందుకు కదలదు అని ప్రకటించబడింది." "ప్రయాణికులందరూ రైలులోంచి కిందికి దిగారు. ట్రైన్ తిరిగి నోయిడా వైపు వచ్చింది. తరువాతి 20-25 నిమిషాల వరకు మరో రైలు రాలేదు" అని ప్రయాణీకుడు చెప్పాడు.
బాంబే ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య... ఏడంతస్తుల హాస్టల్ భవనంపై నుంచి దూకి..
అంతకుముందు రోజు, మయూర్ విహార్-1 మెట్రో స్టేషన్ స్టేషన్ కంట్రోలర్ నుండి ఒక వ్యక్తి కదులుతున్న రైలు ముందు దూకినట్లు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. బాధితుడిని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. అనంతరం అతని తండ్రి, సోదరికి సమాచారం అందించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఆ వ్యక్తి మానసిక అనారోగ్యంతో ఉన్నాడని, ఇక్కడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని విచారణలో తేలిందని తెలిపారు. "సీసీటీవీ ఫుటేజీలలో, మయూర్ విహార్-1 మెట్రో స్టేషన్ వద్ద మధ్యాహ్నం 1:51 గంటలకు ప్లాట్‌ఫారమ్ నెం. 1 నుండి వ్యక్తి తనంతట తానుగా దూకినట్లు తెలిసింది. తదుపరి విచారణ జరుగుతోంది. విచారణ ప్రక్రియ ప్రారంభించాం" అన్నారాయన. .
పఖాలే IIT-కాన్పూర్ నుండి ఎం టెక్ చేసాడు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డీవో)లో నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. ఆ తర్వాత, గెయిల్‌లో సీనియర్ మేనేజర్‌గా చేరాడు, అయితే 2022 నవంబర్‌లో రాజీనామా చేసినట్లు పోలీసులు తెలిపారు.
