Asianet News TeluguAsianet News Telugu

ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. పురుషాంగం కోసేసుకున్నాడు..!

తనకు ఇష్టం లేకుండా.. బలవంతంగా పెళ్లి చేస్తున్నారని.. ఆ పెళ్లిని ఆపాలని అనుకున్నాడు. అందుకు ఏకంగా తన పురుషాంగాన్ని కోసేసుకున్నాడు.

Man Cuts his penis to stop Marriage
Author
Hyderabad, First Published Jun 30, 2021, 12:52 PM IST

ఆ యువకుడికి అప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. కానీ.. ఇంట్లో తల్లిదండ్రులు మాత్రం వయసు అయిపోతోందని.. పెళ్లి నిశ్చయించారు. అతను ఎంత చెప్పినా.. తల్లిదండ్రులు వినిపించుకోలేదు. దీంతో..  తనకు ఇష్టం లేకుండా.. బలవంతంగా పెళ్లి చేస్తున్నారని.. ఆ పెళ్లిని ఆపాలని అనుకున్నాడు. అందుకు ఏకంగా తన పురుషాంగాన్ని కోసేసుకున్నాడు. ఆ తర్వాత.. తాను పెళ్లికి ఇక పనికి రానంటూ గట్టిగా కేకలు వేశాడు.

తల్లిదండ్రులు అతనిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు సేలం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్‌కు చెందిన మురుగన్‌ కుమారుడు విజయరాఘవన్‌ (23)కు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించగా, రెండేళ్ల వరకు తనను వదిలేయాలని అతను చెప్పాడు. 

అయినా వినకుండా కుటుంబీకులు అతనికి ఓ యువతితో వచ్చేవారం నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహం చెం దిన విజయరాఘవన్‌ సోమవారం ఉలితో పురుషాంగాన్ని కోసుకున్నాడు. ఈ హడావుడిలో చేతిలో వున్న ఉలి గొంతుకు తగలడంతో అక్కడా తీవ్రంగా గాయమైంది. కుటుంబీకులు అతనిని ఆత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios