వాణాసిలో 2006లో జరిగిన సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కేసులో సుమారు 30 మంది మరణించగా.. వందలాది మంది గాయపడ్డారు. ఈ కేసులో 16 ఏళ్ల తర్వాత దోషిగా వాలి ఉల్లాహ్ తేలాడు. గజియాబాద్ సెషన్స్ కోర్టు వాలి ఉల్లాహ్‌ను దోషిగా తేల్చింది. ఈ నెల 6వ తేదీన శిక్షను ఖరారు చేయనుంది. 

న్యూఢిల్లీ: వారణాసిలో సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 16 ఏళ్ల తర్వాత నిందితుడు దోషిగా నిర్ధారణ అయ్యాడు. గజియాబాద్ సెషన్స్ కోర్టు ఈ కేసులో నిందితుడు వాలి ఉల్లాహ్‌ను దోషిగా తేల్చింది. అయితే జూన్ 6వ తేదీన శిక్ష మోతాదును వెల్లడించనుంది.

2006 మార్చి 7వ తేదీన వారణాసిలో సీరియల్ బాంబ్ బ్లాస్ట్‌లు జరిగాయి. ఈ ఘటన యావత్ దేశంలో కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలోని సంకట్‌మోచన్ ఆలయం, కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో సుమారు 30 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. 

2006 ఏప్రిల్ 5వ తేదీన ఉత్తరప్రదేశ్ పోలీసులు వాలి ఉల్లాహ్‌ను అరెస్టు చేశారు. ప్రయాగ్ రాజ్ జిల్లా ఫూల్‌పూర్ గ్రామ నివాసి అయిన వాలి ఉల్లాహ్‌ను ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణను గజియాబాద్‌కు బదిలీ చేశారు.

బీహార్‌లోని లఖిసరాయ్ (Lakhisarai) జిల్లాలో గత మార్చిలో బాంబు పేలుడు (bomb blast) సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తక్కువ తీవ్రతో కూడిన పేలుడు కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనను లఖిసరాయ్ జిల్లా ఎస్పీ సుశీల్ కుమార్ ధృవీకరించారు. పిపారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని వాలిపూర్ గ్రామంలో ఉదయం 7 గంటల సమయంలో బాంబు పేలుడు సంభవించిందని ఎస్పీ సుశీల్ కుమార్ తెలిపారు. 

‘బాంబును ప్లాస్టిక్ సంచిలో ఉంచారు.. దానిని లుటన్ రజక్ అనే వ్యక్తికి చెందిన ఇంటి పెరట్లో పెట్టారు. ఆ స్థలంలో ప్లాస్టిక్ బ్యాగ్ కనిపించిన తర్వాత ఓ మైనర్ బాలుడు దానిని తెలిరిచాడు. ఒకే కుటుంబానికి చెందిన మరో ఆరుగురు వ్యక్తులు అక్కడికి సమీపంలో నిలబడి ఉన్నారు. మైనర్ బాలుడు ప్లాస్టిక్ బ్యాగ్ తెరిచిన వెంటనే పేలుడు సంభవించింది. బాంబు తీవ్రత తక్కువగా ఉంది. మొత్తం ఏడుగురికి గాయాలు అయ్యాయి. గాయపడినవారికి పిపారియా ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించారు’ అని ఎస్పీ సుశీల్ కుమార్ తెలిపారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నట్టుగా ఎస్పీ సుశీల్ కుమార్ తెలిపారు. బాంబు పేలుడు చోటుచేసుకున్న ప్రాంతంలో మరో మూడు తక్కువ తీవ్రత కలిగిన బాంబులను గుర్తించామని చెప్పారు. గాయపడిన వారి వద్ద నుంచి వాంగ్మూలాలు తీసుకున్నామని చెప్పారు. బాంబు అక్కడకు ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి విచారణ కొనసాగుతుందని వెల్లడించారు.