వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి విషం తాగి పోలీస్ స్టేషన్ కు రావడం కలకలం రేపింది. అతని మీద ప్రియురాలే ఫిర్యాదు చేయడానికి రావడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తేలింది. 

కర్ణాటక : కర్ణాటకలోని బనశంకరిలో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ డెలివరీ బాయ్ విషం తాగి పోలీస్ స్టేషన్కు వచ్చాడు. అది తెలిసిన పోలీసులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటన కర్ణాటకలోని బనశంకరి చంద్ర లేఔట్ లో జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. విషం తాగి పోలీస్ స్టేషన్ కు వచ్చిన డెలివరీ బాయ్ అనిల్ (30). అతనికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. వీరి వ్యవహారం కొద్ది రోజులు బాగానే గడిచినప్పటికీ.. ఇటీవలే మహిళ భర్తకు తెలిసింది. 

దీంతో కోపానికి వచ్చిన అతను అనిల్ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఈ వ్యవహారంలో ఆ మహిళతో దూరంగా ఉండాలని పోలీసులు అనిల్ ను హెచ్చరించారు. కానీ అనిల్ ఆ మహిళను కలవకుండా ఉండలేకపోయాడు. మళ్ళీ ఆ మహిళను కలవడానికి ప్రయత్నించాడు. తనతో సంబంధాన్ని కొనసాగించాలని ఆమెను వేధింపులకు గురిచేసాడు. ఆ మహిళ మనస్థాపం చెందింది. అనిల్ తనను వదిలేలా లేడని అనుకున్న మహిళ.. అతని మీద వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి నిర్ణయించుకుంది. 

ఈ మేరకు గురువారం చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. అయితే ఈ విషయం అనీల్ కు తెలిసింది. వెంటనే అతను కూడా పోలీస్ స్టేషన్కు వచ్చాడు. ఆ మహిళా ఆమె భర్త తనమీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు. ఈ క్రమంలోనే తాను చనిపోవడానికి విషయం తాగానని పోలీసులకు చెప్పాడు. అతని మాటలతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. 

ఫోన్ రిపేర్ చేయడానికి రూ. 500 అడిగాడని.. కత్తితో పొడిచి హత్య..

ఇదిలా ఉండగా, రాజస్థాన్ లోని నాగోర్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. రాజస్తాన్ నాగౌర్ జిల్లాలోని శ్రీ బాలాజీ కాలనీకి చెందిన అనుపమ రామ్ అనే వ్యక్తి తన పక్కింట్లో ఉన్న వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ అనోపరామ్ ని నిజంగానే మనస్ఫూర్తిగా ప్రేమించింది. వివాహేతర సంబంధాలకు పునాది అయిన శారీరక సంబంధం మాత్రమే కాదు అతనితో కలిసి జీవితాంతం ఉండాలనుకుంది.

అయితే అనోపరామ్ మాత్రం కేవలం శారీరక సంబంధం వరకే పరిమితం కావాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆమె ప్రియుడి మీద తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. తన తన భర్తను వదిలేసి వస్తానని.. నువ్వు నీ భార్యను వదిలేసి రమ్మని కోరింది. అయితే, అలా చేయడానికి అనోపరామ్ ఒప్పుకోలేదు. అతనికి భార్యను వదిలేసి ప్రియురాలితో వెళ్లడం ఇష్టం లేదు. మరోవైపు ప్రియురాలి ఒత్తిడి ఎక్కువవుతుంది. దీంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం యూట్యూబ్లో వీడియోలు చూశాడు.

వాటి ప్రకారం ప్రియురాలిని చంపడానికి ప్లాన్ వేశాడు. కలవాలని చెప్పి ప్రియురాలిని రమ్మని కబురు పెట్టాడు. అనోపరామ్ ను కలవడానికి ఆ మహిళ జనవరి 22న బయలుదేరింది. ఇంట్లో మాత్రం తాను పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి వచ్చింది. అయితే, రెండు రోజులు గడుస్తున్నా ఆమె పుట్టింటికి వెళ్లలేదు.. ఇటు మెట్టినింటికి రాలేదు. దీంతో ఆమె భర్త, తల్లిదండ్రులు కంగారుపడి జనవరి 24వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికులను విచారించగా కనబడకుండా పోయిన మహిళకు.. వారి పక్కింట్లో ఉండే అనోపరామ్ కు వివాహేతర సంబంధం ఉందన్న విషయం వెలుగు చూసింది. వెంటనే పోలీసులు అనోపరామ్ ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో అనోపరామ్ నిజం ఒప్పుకున్నాడు. జనవరి 22న తనను కలవడానికి వచ్చిన ప్రియురాలిని బల్వా రోడ్డులోని అడవిలో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా కోసి అడవిలోని ఓ బావిలో పడేసానని చెప్పాడు. అనోపరామ్ వివరాల మేరకు పోలీసులు ఆ బావి వద్దకు వెళ్లి వెతకగా ఆ చుట్టుపక్కల మహిళ బట్టలు, వెంట్రుకలు దొరికాయి. ఆ మహిళ శరీర భాగాల కోసం బావిలోకి దిగి గాలింపు చేపట్టారు. మూడు రోజులుగా శరీర భాగాల కోసం బావిలో గాలింపు చేస్తున్నారు. ఈవిషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా సంచలనంగా మారింది.