భూ వివాదం కారణంగానే తన అన్న కుటుంబంలోని ఐదుగురు సభ్యులను హత్య చేసినట్లు ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ఓ వీడియోలో అంగీకరించింది. ఇప్పుడీ వీడియో సంచలనంగా మారింది. 

ఒడిశా : ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు murderకు గురయ్యాడు. అయితే తనే ఈ హత్యలు చేశానంటూ ఓ వ్యక్తి వీడియోను రిలీజ్ చేశాడు. భూవివాదం కారణంగా తన అన్నయ్య కుటుంబంలోని ఐదుగురిని హత్య చేసినట్లు మంగళవారం ఓ వ్యక్తి video ద్వారా అంగీకరించాడు. Odishaలోని కటక్ జిల్లా కుసుపూర్ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

మృతులను అలేఖ్ సాహు (46), అతని భార్య రష్మీ రేఖ (41) కుమార్తె స్మృతి సంధ్య (19), ఇద్దరు మైనర్ కుమారులు స్మృతి సాహు (17), స్మృతి సౌరవ్ (16)గా గుర్తించారు. నిందితుడిని సిబా ప్రసాద్ సాహు (42)గా గుర్తించారు. నిందితుడు సిబా సాహుకు తన అన్నయ్యతో కొంత కాలంగా భూమి విషయంలో వివాదం ఉన్నట్లు సమాచారం. ఈ సమస్య మీదనే ఇద్దరు సోదరులు ఒక రోజు రాత్రి గొడవకు దిగారు. దీంతో మాటా మాటా పెరిగి సిబా మొత్తం అన్న కుటుంబాన్ని నరికి చంపాడు.

తన సోదరుడి కుటుంబాన్ని హత్య చేసిన తర్వాత, షిబా ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. అందులో తన నేరాన్ని అంగీకరించాడు. సంఘటన గురించి వివరించాడు. ‘‘మా అన్నయ్య, అతని కుటుంబ సభ్యులు చాలా కాలంగా నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. పట్టా భూమి విషయంలో వాగ్వాదం జరగడంతో అందరూ కలిసి నన్ను కొట్టారు. వాళ్ళందరూ గుమిగూడి నన్ను కొట్టడంతో నాకు ఏం చేయాలో తోచలేదు. దీంతో నేను వారందరినీ చంపాను. చట్టంలోని నిబంధనల ప్రకారం కోర్టు ఎలాంటి శిక్ష విధించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను' అని సిబా తెలిపారు.

తాను చేసిన తప్పును గుర్తించానని, జాజ్‌పూర్‌లోని బలిచంద్రపూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతానని సిబా తెలిపారు.మరోవైపు జిల్లా మేజిస్ట్రేట్‌ సమక్షంలో జరిగిన ఘటనపై పోలీసు బృందం విచారణ ప్రారంభించింది. కటక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) జుగల్ కిషోర్ భానోత్ మీడియాతో మాట్లాడుతూ, భూవివాదాల వల్లే హత్యలకు కారణమని చెప్పారు.

ఇదిలా ఉండగా, నిజామాబాద్ లో వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని బాలుడిని హత్య చేసిన ఘటన మండలంలోని మేడిపల్లి జీపీ పరిధిలో గల హన్మంతు తండాలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హన్మంతు తండాకు చెందిన జోగిని లక్ష్మి, తన అక్క కొడుకు రాజు(16)తో కలిసి ఉంటోంది. రాజు తల్లిదండ్రులు కొంతకాలం క్రితం మృతి చెందారు. దీంతో రాజు తన చిన్నమ్మ లక్ష్మి దగ్గర ఉంటూ పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. లక్ష్మి పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంది. 

సీతాయి పల్లి గ్రామానికి చెందిన కుర్మ మల్లయ్యతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో బాలుడు తనకు అడ్డుగా ఉన్నాడని భావించింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బాలుడు నిద్రపోయిన తర్వాత పథకం ప్రకారం ప్రియుడితో కలిసి బాలుడిని చీరతో ఉరివేసి హత్య చేసినట్లు తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సీఐ రామన్ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు.