దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో మూసి ఉన్న గదిలో నాలుగు మృతదేహాలు కలకలం రేపాయి. భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి.. భర్త తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.  

దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో మూసి ఉన్న గదిలో నాలుగు మృతదేహాలు కలకలం రేపాయి. భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి.. భర్త తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. 

రోహిణిలోని నాహర్‌పూర్ గ్రామంలో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపింది. మృతుడు బస్ డ్రైవర్ గా గుర్తించారు. అతను ముందుగా తన భార్య, పిల్లలను హత్య చేశాడు. తరువాత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. లేదా తాగిన మైకంలో కూడా ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోహిణి ప్రాంతనికి చెందిన డ్రైవర్ ధీరజ్ (30) ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.