Asianet News TeluguAsianet News Telugu

దూరం పెట్టిందని..  వివాహిత ప్రైవేట్ పార్ట్స్, చేతులు,చెవులు కోసేసిన ప్రియుడు..

బీహార్‌లోని భాగల్‌పూర్‌లో దారుణం జరిగింది. ఓ మహిళను మార్గమధ్యంలో దారుణంగా హత్య చూసిన స్థానికులు చలించిపోయాయి. హంతకుడు మహిళ శరీరాన్ని అనేక ముక్కలుగా నరికాడు. ముందుగా మహిళ రెండు చేతులు, రొమ్ములను నరికేశాడు. ఆ తర్వాత హంతకుడు పదునైన ఆయుధంతో ఆమె వీపుపై పలుచోట్ల కత్తితో పొడిచాడు. ఈ ఘటన  భాగల్‌పూర్‌లోని పిర్‌పైంటిలోని సింఘియా వంతెన సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది. 

 

Man CHOPS OFF woman's breasts in crowded market
Author
First Published Dec 5, 2022, 8:29 PM IST

బీహార్‌లో శ్రద్ధా హత్య లాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. భాగల్పూర్ చెందిన నీలం దేవి కూడా దాదాపు ఢిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్‌లాగా హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన షకీల్ తన సహచరుడితో కలిసి.. ఆ మహిళ చేతులు, చెవులు, ప్రవేట్ పార్ట్స్ ను కోసివేశాడు.నిందితులు ఆ మహిళ కాలును కూడా కోసేందుకు ప్రయత్నించగా.. ఎవరో వస్తున్న శబ్దం విని ఇద్దరూ పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆ మహిళను మాయాగంజ్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అధిక రక్తస్రావం కావడమే మృతికి కారణమని వైద్యులు తెలిపారు.

అయితే.. ఆ మహిళ తన మరణానికి ముందు తన హంతకుడి పేరును పోలీసులకు చెప్పిందని పేర్కొన్నారు.రద్దీగా ఉండే మార్కెట్‌లో అందరి సమక్షంలోనే  ఓ మహిళపై ఓ వ్యక్తి  పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఆ సమయంలో ఆ మహిళ ప్రైవేట్ పార్టులను తెగనరికాడు. అంతటితో ఆగకుండా.. ఆ ఉన్మాది ఆమె చేతులు, కాళ్లు, చెవులు కూడా కత్తితో కోసివేశాడు.ఈ సంచలన ఘటన బీహార్‌లోని భాగల్‌పూర్‌లో చోటుచేసుకుంది. 

పోలీసు వర్గాల కథనం ప్రకారం..పిరపైంటి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోటీ దిలౌరి నివాసి అశోక్ యాదవ్ భార్య నీలం దేవి (42) శనివారం దారుణ హత్యకు గురైంది. హంతకుడు షకీల్ మియాన్ మృతురాలి భర్త అశోక్ యాదవ్ కు స్నేహితుడు. ఇంతకుముందు నిందితుడు తరచూ వారి ఇంటికి  వెళ్లేవాడు. ఈ క్రమంలో అతను నీలంతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించాడు. అయితే.. కుటుంబ ఒత్తిడి కారణంగా నీలం దేవీ అతడిని దూరం పెట్టింది. దీంతో ఆగ్రహానికి షకీల్ ఆమెను చంపాలని ప్లాన్ చేశాడు. కానీ.. ఆ విషయాన్ని నీలమ్‌కి తెలుసుకోలేకపోయింది. 

ఈ క్రమంలో శనివారం నిత్యవసర సరుకులు కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు వెళ్లిన నీలం దేవిని మార్గం మధ్యంలో అడ్డగించాడు. ఆ తరువాత తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో దాడి చేశారు. ఈ దాడికి షకీల్ సోదరుడు మహ్మద్ షేక్ జుద్దీన్ కూడా సహకరించాడు.  ఈ దాడిలో  మొదటగా  ఆ మహిళ ప్రైవేట్ పార్ట్స్ (రొమ్ము)ను కోసివేసి వేశారు. ఆ తర్వాత ఆమె రెండు చేతులు, రెండు కాళ్లు, రెండు చెవులను కత్తితో కోసి వేశాడు. అటుగా వెళ్తున్న ఓ బాటసారి బాధితురాలి అరుపులు విని.. ఆమె భర్త అశోక్ యాదవ్‌కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేశాడు. స్థానికుల సహాయంతో ఆమె ఆస్పత్రికి తరలించారు. కానీ.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అధిక రక్తస్రావం కావడమే మృతికి కారణమని వైద్యులు తెలిపారు. 
 
హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చికెన్‌ చాపర్‌తో మహిళ అవయవాలను కోశాడనీ, దీంతో పాటు నిందితుడి ఇంటి నుంచి పోలీసులు మరిన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.మహిళ హత్యతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ కేసులో నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగతా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

వివాదానికి కారణమదేనా

డబ్బుల వ్యవహారంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగిందని ఎస్‌డిఓ, ఎస్‌డిపిఓ తెలిపారు. ఈ నేపథ్యంలో ఓ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు నిందితుడి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకున్నట్లు ఇప్పటివరకు విచారణలో తేలిందని ఎస్‌ఎస్పీ బాబూరామ్ తెలిపారు. నెల రోజుల క్రితం కూడా డబ్బు తిరిగి ఇచ్చే విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.

ఈ క్రమంలో  శనివారం నిందితులు మహిళపై పదునైన ఆయుధంతో దాడి చేశారు. అయితే నిందితుడితో తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి శత్రుత్వం లేదని మృతురాలు భర్త చెప్పాడు. ఈ ఘటనలో ప్రమేయం ఉందన్న అనుమానంతో పోలీసులు ఇప్పటి వరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. యువతిపై దాడి చేసిన అనంతరం షకీల్ అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపుమడుగులో పడి ఉన్న మహిళలను చూసిన స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం అందించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios