Asianet News TeluguAsianet News Telugu

ఆడగొంతుతో మాట్లాడి మాయ చేశాడు.. రూ. 36 లక్షలు కొట్టేశాడు..

రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మోసాల్లో వెరైటీ వైఖరిని అనుసరిస్తున్నారు దొంగలు. అలాంటిదే ఓ ఘరానా మోసం చెన్నైలో జరిగింది. గొంతుమార్చి ఆడగొంతుతో మాట్లాడి ఓ వ్యాపారిని రూ.36 లక్షలకు మోసగించాడో నైజీరియా యువకుడు. ఆ యువకుడిని బుధవారం చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. 

man cheated by nigerian with fake call looting 36 lakhs in chennai - bsb
Author
Hyderabad, First Published Dec 25, 2020, 10:11 AM IST

రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మోసాల్లో వెరైటీ వైఖరిని అనుసరిస్తున్నారు దొంగలు. అలాంటిదే ఓ ఘరానా మోసం చెన్నైలో జరిగింది. గొంతుమార్చి ఆడగొంతుతో మాట్లాడి ఓ వ్యాపారిని రూ.36 లక్షలకు మోసగించాడో నైజీరియా యువకుడు. ఆ యువకుడిని బుధవారం చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. 

వివరాల్లోకి వెడితే చెన్నై కీల్పాక్కంకు చెందిన జోసెఫ్‌ (48)కు రాయల్‌ ట్రేడింగ్‌ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ వివరాలను  తన ఫేస్‌బుక్‌ పేజీలో పొందుపరిచారు. దీన్ని గమనించిన లండన్‌కు చెందిన ఎలిజబెత్‌ అనే మహిళ మెసెంజర్‌ ద్వారా జోసెఫ్‌ను సంప్రదించి పరిచయం పెంచుకుంది. 

కొద్ది రోజుల తరువాత ముంబైలో బ్లడ్ క్యాన్సర్‌ను నయం చేసే ఫోలిక్‌ ఆయిల్‌ దొరుకుతుందని అది కొని పంపితే నగదు చెల్లిస్తానని నమ్మబలికింది. రూ. 36 లక్షల ఫోలిక్‌ ఆయిల్‌ పంపితే దాంట్లో రూ.6 లక్షలు కమిషన్‌గా ఇస్తానని తెలిపింది.  

ఫోలిక్ ఆయిల్ కోసం సునీత అనే మహిళతో మాట్లాడి పంపాలని కోరింది. దీంతో జోసెఫ్‌ మెసెంజర్‌ ద్వారా సునీతతో మాట్లాడగా తన బ్యాంకు అకౌంట్‌కు రూ.36 లక్షలు జమ చేసినట్లయితే వెంటనే ఫోలిక్‌ ఆయిల్‌ పంపుతానని తెలిపింది. జోసెఫ్‌ ఆమె ఖాతాకు రూ.36 లక్షలు జమ చేశాడు.

ఆ తరువాత సునీత, ఎలిజబెత్‌ల కోసం ఫోన్‌లో ట్రై చేస్తే వారి ఫోన్లు స్విఛాప్‌ ఉన్నాయి. దీంతో తాను మోసపోయినట్లు తెలుసుకున్న జోసెఫ్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ముంబైలోనే మోసం జరిగినట్లు తెలిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios