ఒక యువతిని ప్రేమ పేరుతో నమ్మించి.. ఆమెను లైంగికంగా అనుభవించాడు. అతని చర్యల వల్ల సదరు యువతి గర్భం దాల్చడంతో నీవెవరె నాకు తెలియదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

వివరాల్లోకి వెళితే... బెంగళూరు సమీపంలోని నెలమంగళ తాలుకా చిక్కగొల్లరహట్టి గ్రామానికి చెందిన మోహనగౌడ స్థానికంగా ఉన్న ఓ యువతిపై కన్నేసి.. ప్రేమించానంటూ నాటకమాడాడు. స్థానికంగా ఉన్న లాడ్జి దగ్గరకు తీసుకెళ్లి ఆమెను శారీరంగా అనుభవించాడు.

ఈ తతంగాన్ని వీడియో తీసి బెదిరించి అనేకసార్తు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చడంతో నువ్వెవరో నాకు తెలియదు అంటూ నాటకమాడాడు. ఓ దీంతో మోహనగౌడ రౌడీలను పంపి ఆమెను బెదిరించాడు.

తల్లిదండ్రుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి కొన్నాళ్లకు మగబిడ్డకు జన్మనిచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోహనగౌడను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీనిపై నెలమంగళలోని జేఎంఎఫ్‌సీ కోర్టులో విచారణ జరిగింది.

న్యాయమూర్తి ముందు యువతికి పుట్టిన బిడ్డకు తనకు ఎలాంటి సంబంధం లేదని మోహనగౌడ వాదించాడు. అయితే యువతి మోహనగౌడతో దిగిన ఫోటోలు, లాడ్జి సీసీటీవీ ఫుటేజీలు, కారు, బైకుపై తిరిగిన వీడియోలు, ఫోన్ కాల్ రికార్డులను పోలీసులు కోర్టుకు సమర్పించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం డీఎన్ఏ పరీక్షకు ఆదేశించింది. ఈ నివేదికలో బిడ్డ మోహనగౌడకు కలిగిందేనని తేలింది.