చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో విషాదం చోటు చేసుకొంది. కూతురి డెడ్ బాడీనీ తండ్రి 3 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లాడు. అంబులెన్స్ రాకపోవడంతో ఆయన కూతురి శవాన్ని తీసుకెళ్లాడు.

తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలైలో ప్రమాదవశాత్తు రూపశ్రీ అనే  ఐదేళ్ల బాలిక  మరణించింది. బావిలో పడిన బాలికను పోలీసులు  సహాయక సిబ్బంది బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం బాలిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ కు సమాచారం అందించారు. అయితే అంబులెన్స్ మాత్రం  రాలేదు. అంబులెన్స్ కోసం గంటల తరబడి ఎదురు చూసినా ఫలితం లేకపోయింది.

దీంతో రఘు తన కూతురు డెడ్ బాడీని తన భుజాన మోసుకొని తీసుకెళ్లాడు. మూడు కి.మీ దూరంలో భుజాన మోసుకొంటూ రూపశ్రీని తీసుకెళ్లాడు.  అంబులెన్స్ ఎందుకు రాలేదనే విషయమై  ఇంకా స్పష్టత రాలేదు.

దేశంలో గతంలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకొన్నాయి. అంబులెన్స్ లేదా ఇతర వాహనాలు అందుబాటులో లేని కారణంగా డెడ్ బాడీలను తమ భుజాన  మోసుకెళ్లిన ఘటనలు అనేకం జరిగాయి.