పంజాబ్ లోని జలంధర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రానన్నదని ఆగ్రహించిన ఓ భర్త.. భార్యతోసహా ఆమె కుటుంబసభ్యులు ఐదుగురిపై కిరోసిన్‌పోసి నిప్పుపెట్టాడు. 

పంజాబ్‌లోని జలంధర్ అత్యంత దారుణమైన వార్త వెలుగులోకి వచ్చింది. భార్యను ఎంత బతిమిలాడిన పుట్టింటిని వీడవడం లేదని, కాపురానికి రావడం లేదని ఆగ్రహించిన ఓ భర్త..తన అత్తమామల ఇంటికి వెళ్లి భార్య, కూతురు, కొడుకుతో సహా తన అత్త, మామలపై కిరోసిన్‌పోసి సజీవ దహనం చేశాడు. బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో గదిలోనే అందరూ సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటన జలంధర్ జిల్లాలోని మహిత్‌పూర్‌లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకె్ళ్తే.. నిందితుడు కుల్దీప్ సింగ్ ఖుర్షెడ్‌పూర్ గ్రామ నివాసి. బీట్ల గ్రామానికి చెందిన సుర్జన్ సింగ్ కుమార్తె పరమ్‌జిత్ కౌర్‌తో గత ఐదేండ్ల క్రితం వివాహం జరిగింది. అయితే..కుల్దీప్‌ సింగ్ నిత్యం తాగివచ్చి కొడుతుండటంతో పరంజీత్‌ తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి గత ఐదు-ఆరు నెలలుగా తన తల్లిదండ్రుల వద్ద నివసిస్తున్నారు. లుథియానాలోని ఖుర్షెడ్‌పూర్ గ్రామంలోని తన ఇంటికి పరమ్‌జిత్ తిరిగి రావాలని కుల్దీప్ సింగ్ కోరుకున్నాడు. కానీ.. కుల్దీప్‌ నిత్యం తాగివచ్చి తనని, తన పిల్లలను కొడుతుండటంతో పుట్టింటి నుంచి తిరిగి రావడానికి నిరాకరించింది.

 ఇద్దరి మధ్య ఇంట్లో గొడవలు ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. అతను డ్రగ్స్‌కు కూడా అలవాటు పడ్డాడు, ఈ కారణంగా భార్య కోపంతో తన తల్లి ఇంటికి వచ్చింది. దీంతో భర్తకు కోపం వచ్చింది. సోమవారం అర్థరాత్రి కుల్‌దీప్‌, అతని ఇద్దరు సహచరులు ఐదుగురిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఈ సందర్భంగా గది బయటి నుంచి తాళం వేసి ఉంది.

 మృతులను పరంజిత్ కౌర్, ఆమె తండ్రి సుర్జన్ సింగ్, తల్లి జోగింద్రో మరియు ఆమె ఇద్దరు పిల్లలు, 8 ఏళ్ల అర్ష్‌దీప్, 5 ఏళ్ల అన్మోల్‌గా గుర్తించినట్లు జలంధర్ పోలీసు సూపరింటెండెంట్ సతాబ్‌జిత్ సింగ్ తెలిపారు. కుల్దీప్ సింగ్ తన కళ్ల ముందే భార్య, కూతురు అర్ష్‌దీప్ కౌర్, కొడుకు గుర్మోహన్ సింగ్, అత్తగారు జోగింద్రో, బావ సుర్జన్ సింగ్‌లను సజీవ దహనం అవుతున్న పట్టించుకోలేదు. గ్రామస్థులు ఘటన స్థలానికి చేరుకోవడంతో నిందితుడు అక్కడ నుంచి పరార్ అయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.