Asianet News TeluguAsianet News Telugu

బాలికతో అనుచితంగా ప్రవర్తించాడని.. చితగ్గొట్టి, నగ్నంగా ఊరేగించి..

కర్ణాటకలోని హసన్ జిల్లాలోని మహారాజా పార్కుకు మేఘరాజ్ అనే వ్యక్తి తరచుగా వెల్తుండేవాడు. బుధవారం సాయంత్రం ఆ పార్కులో ఒంటరిగా ఉన్న బాలికతో మేఘరాజ్ అనుచితంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని స్థానికులు గమనించారు. అతడి మీద దాడికి తెగబడ్డారు

man brutally thrashed and forced to walk naked over suspicion of harassing girl in Karnataka
Author
Hyderabad, First Published Jan 14, 2022, 2:25 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కర్ణాటక : Karnatakaలో దారుణం వెలుగు చూసింది. బాలికతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని దారుణంగా శిక్షించారు. విచక్షణా రహితంగా కొట్టారు. రద్దీగా ఉండే జంక్షన్ లో Nakedగా Parad చేయించారు. ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు రంగంలోకి దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తమకు ఫిర్యాదు చేయకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని Severe punishmentను విధించిన వ్యక్తుల గురించి పోలీసుల అన్వేషణ సాగిస్తున్నారు. 

కర్ణాటకలోని హసన్ జిల్లాలోని మహారాజా పార్కుకు మేఘరాజ్ అనే వ్యక్తి తరచుగా వెల్తుండేవాడు. బుధవారం సాయంత్రం ఆ పార్కులో ఒంటరిగా ఉన్న బాలికను మేఘరాజ్ గమనించాడు. చుట్టూ ఎవరూ తనను గమనించడం లేదని నిర్థారణకు వచ్చాడు. ఆ బాలిక దగ్గరికి వెళ్లాడు. ఆమెతో Inappropriateగా ప్రవర్తించాడు. దానికి బాలిక ప్రతిఘటించింది. అయినా అతను వీడలేదు. ఈ విషయాన్ని స్థానికులు గమనించారు. 

మేఘరాజ్ బారినుంచి బాలికను రక్షించారు. అతన్ని ఏం చేస్తున్నావ్ అంటూ గద్దించారు. ఆ తరువాత అతడి మీద Attackకి తెగబడ్డారు. అతడిని చితక్కొట్టారు. అంతటితో ఊరుకోలేదు. కనీసం పోలీసులకు అప్పగించలేదు. ఆ తరువాత అతడిని నగ్నంగా మార్చి రద్దీగా ఉండే హేమావతి సర్కిల్ దగ్గర ఊరేగించారు. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. మేఘరాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే మేఘరాజ్ మీద దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు రావడాన్ని గమనించిన ఆ వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. 

ఇదిలా ఉండగా, తమిళనాడులో బుధవారం దారుణం చోటుచేసుకుంది. తమిళనాడు జిల్లా విల్లుపురం, సెంజి సమీపంలోని ఈ చంకుప్పానికి చెందిన 16యేళ్ల బాలిక మీద బంధువులే సామూహిక sexual assaultకి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. 80 వృద్ధుడితో కలిసి minor girlను మరో ఇద్దరు యువకులు కూడా బలాత్కారం చేసినట్లు తెలిసింది. 

ఈ కేసులో 80 యేళ్ల వృద్ధుడు వెంకటేశన్ పెద్ద కుమారుడు మోహన్, ఇతని స్నేహితుడు ఇళయరాజా తదితరులను పోలీసులు arrest చేశారు. పోలీసు కథనం మేరకు లైంగిక దాడికి గురైన బాలిక పదిహేనేళ్ల క్రితమే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆమె కోవైలో ఉన్న శరణాలయంలో ఉంటూ ప్లస్ వన్ చదువుకుంటోంది.

సెలవు రోజుల్లో సెంజి సమీపంలో ఉన్న ఈచంకుప్పం ప్రాంతంలోని తన పెద్దమ్మ ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో రెండు రోజుల ముందు విద్యార్థి అనారోగ్యం బారిన పడడంతో బంధువులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలిక నాలుగు నెలల గర్భంతో ఉన్నట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణంలో ఆమెకు వరసకు అన్న అయిన మోహన్ మొదట విద్యార్థినిపై లైంగిక దాడి చేశాడని తరువాత మిగిలిన వారు అత్యాచారం చేసినట్లు తెలిసింది. దీనికి సహకరించిన పెద్దమ్మ కుప్పును అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఐదుగురిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios