డబ్బులు ఇవ్వలేదనే నెపంతో తల్లిని రోడ్డుపై ఈడ్చుకెళ్లి కొట్టాడు ఓ కొడుకు. వృద్దురాలైన  నల్లమాల్ ను కాపాడేందుకు ఆమె పెంపుడు కుక్క ప్రయత్నించింది. ఈ ఘటనకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తల్లిపై దాడి చేసిన షణ్ముగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

చెన్నై: వృద్దురాలైన తల్లిని ఓ వ్యక్తి డబ్బుల కోసం రోడ్డుపై పడేసి చితకబాదాడు. ఆ సమయంలో పెంపుడు కుక్క ఆ వృద్దురాలిని రక్షించేందుకు ప్రయత్నించింది.ఈ వీడియో ఒకటి సోషల్ మీడియోలో వైరల్ గా మారింది.

Scroll to load tweet…

తమిళనాడు రాష్ట్రంలోని పొన్నెరిపట్టిలోని అమన్ అనే వ్యక్తి డబ్బుల కోసం తన తల్లిని దారుణంగా కొట్టాడు. రోడ్డుపైకి తీసుకొచ్చి ఆమెను కొట్టాడు. ఈ దెబ్బలకు తాళలేక ఆమె పెద్దగా కేకలు వేసింది. ఆ సమయంలో పెంపుడు కుక్క ఒకటి ఆమెను రక్షించేందుకు ప్రయత్నించింది. వృద్దురాలిని కొడుతున్న కొడుకుపై కుక్క దాడి చేసేందుకు ప్రయత్నించింది.

పొన్నెరిపట్టికి చెందిన నల్లమ్మల్ అనే మహిళ భర్త చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె తన భూమిని కొడుకు పేరును రిజిస్ట్రేషన్ చేయించింది. ఉపాధి హామీ పధకం కింద ఆమె కూలీ పనిచేస్తోంది.ఈ పని చేయడం ద్వారా వచ్చిన డబ్బులతో ఆమె జీవిస్తోంది.

ఉపాధి హమీ పనులతో పాటు ఇతరత్రా కూలీ పనులు చేయడం ద్వారా వచ్చిన రూ. 3 లక్షలను ఆమె సంపాదించింది. ఈ డబ్బును తనకు ఇవ్వాలని కొడుకు షణ్ముగం డిమాండ్ చేశాడు. ఆమె డబ్బు దాచిన తాళం చెవిని లాక్కొనేందుకు ప్రయత్నించాడు.

నల్లమ్మల్ పెంపుడు కుక్క షణ్ముగంపై దాడికి ప్రయత్నించింది. నల్లమ్మల్ భార్య సహా మరికొందరు ఆ కుక్కను తరిమివేశారు. నల్లమ్మల్ ను రోడ్డుపైనే వదిలివెళ్లారు.

నల్లమ్మల్ పై కొడుకు షణ్ముగం దాడి ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో షణ్ముగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. షణ్ముగం భార్య పరారీలో ఉంది.