పనాజీ: బురాఖా ధరించి లేడీస్ టాయి‌లెట్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గోవా రాష్ట్ర రాజధాని పనాజీ సెంట్రల్ బస్టాండ్‌లో చోటు చేసుకొంది.

విర్గిల్ ఫెర్నాండెజ్ అనే 35 ఏళ్ల వ్యక్తి ముస్లిం మహిళలు ధరించే బురఖాతో లేడీస్ టాయిలెట్‌లోకి ప్రవేశించాడు.  అయితే అప్పటికే టాయిలెట్‌లో ఉన్న మహిళలు అతడిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.  ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఫెర్నాండెజ్‌పై 419 సెక్షన్ కింద కేసు నమదు చేసి దర్యపా్తు చేస్తున్నారు. అయితే  ఫెర్నాండెజ్ ఎందుకు బుర్ఖాను ధరించి లేడీస్ టాయిలెట్‌లోకి ప్రవేశించాడనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.