కొన్ని సందర్భాల్లో వ్యక్తులు చేసే కొన్ని అనాలోచిత పనులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. తాజాగా ఓ వ్యక్తి మూత్ర విసర్జన కోసం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లోకి ఎక్కగా.. ఊహంచని పరిణామాలు ఎదుర్కొవాల్సి వచ్చింది.

కొన్ని సందర్భాల్లో వ్యక్తులు చేసే కొన్ని అనాలోచిత పనులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. తాజాగా ఓ వ్యక్తి మూత్ర విసర్జన కోసం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లోకి ఎక్కగా.. ఊహంచని పరిణామాలు ఎదుర్కొవాల్సి వచ్చింది. వివరాలు.. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న అబ్దుల్ ఖాదిర్ తన కుటుంబంతో కలిసి మధ్యప్రదేశ్‌లోని తన స్వగ్రామం సింగ్‌రౌలీకి వెళ్తున్నాడు. అబ్దుల్ హైదరాబాద్‌లో ఒకటి, సింగ్రౌలీలో రెండు డ్రైఫ్రూట్స్ దుకాణాలు నడుపుతున్నాడు. తన భార్య, 8 ఏళ్ కొడుకుతో కలిసి అబ్దుల్.. జూలై 15 సాయంత్రం 5.20 గంటలకు భోపాల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి రైలులో సింగ్రౌలీకి వెళ్లాల్సి ఉంది. 

అయితే వారు ప్లాట్‌ఫారమ్‌పై ఉండగా.. అబ్దుల్ మూత్ర విసర్జన చేసేందుకు వాష్‌రూమ్‌ని ఉపయోగించడానికి ఇండోర్‌కు వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. అయితే.. అబ్దుల్ వాష్‌రూమ్‌ నుంచి బయటకు వచ్చేలోపే.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తలుపులు లాక్ చేయబడ్డాయి. రైలు కూడా కదలడం ప్రారంభించింది. క్షణాల్లోనే వేగం పుంజుకుంది. 

దీంతో అబ్దుల్ వేర్వేరు కోచ్‌లలో ఉన్న ముగ్గురు టికెట్ కలెక్టర్లు, నలుగురు పోలీసు సిబ్బంది నుండి సహాయం కోరేందుకు ప్రయత్నించారు. అయితే వారు డ్రైవర్ మాత్రమే తలుపులు తెరవగలరని అతనికి తెలియజేశారు. అయితే డ్రైవర్‌ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా అతడిని అడ్డుకున్నారు. అదే సమయంలోటికెట్ లేకుండా రైలు ఎక్కినందుకు అబ్దుల్ రూ. 1,020 జరిమానా చెల్లించాల్సి వచ్చింది. అతను ఉజ్జయినిలో రైలు ఆగిన తర్వాత దిగి.. భోపాల్‌కు బస్సు టిక్కెట్‌పై అదనంగా రూ. 750 ఖర్చు చేశాడు.

అబ్దుల్ వందేభారత్ రైలులో నుంచి దిగడానికి వీలుకాకపోవడంతో.. అతడి భార్య, కొడుకు అతని గురించి ఆందోళన చెందారు. మరోవైపు ఏం చేయాలనే సందిగ్దతను ఎదుర్కొంది. ఆమె సింగ్రౌలీకి వెళ్లే దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కకూడదని నిర్ణయించుకుంది. దీంతో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో సింగ్రౌలీకి వెళ్లేందుకు రైలు ప్రయాణం కోసం బుక్ చేసిన రూ. 4,000 టిక్కెట్‌లు ఉపయోగించబడలేదు. ఇక, ఈ విధంగా అనాలోచితంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని వాష్‌రూమ్‌ని ఉపయోగించినందుకు అబ్దుల్ కనీసం రూ. 6,000 కోల్పోయాడు.