Asianet News TeluguAsianet News Telugu

కాటేసిందనే కోపంతో.. పామునే కొరికి, కొరికి చంపేశాడు...

తనను పాము కరవడంతో ఆ రైతు కోపంతో ఊగిపోయాడు. ప్రతీకారంతో చెలరేగిపోయాడు. పామును పట్టుకుని కొరకడం మొదలు పెట్టాడు. కోపం తీరేదాకా దాన్ని కొరికి, కొరికి వదిలిపెట్టాడు. 

man bites poisonous snake to death for revenge in odisha
Author
Hyderabad, First Published Aug 13, 2021, 3:18 PM IST

భువనేశ్వర్ : పాములు మనుషుల్ని కరవడం రొటీన్. కానీ మనుషులు పాముల్ని కరవడం వింత. ఇటీవలి కాలంలో ఇలాంటి వింత సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. తనను కరిచిందన్న కోపమో, దారికి అడ్డు వచ్చిందనో.. కారణమేదైనా కానీయండి మనుషులు పాముల్ని కరవడం, కొరికి చంపడం కామన్ అయిపోతోంది. 

అలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది. ఓ వ్యక్తిని పాము కాటేసింది. వెంటనే ఆ వ్యక్తి భయపడలేదు. బెదిరిపోలేదు. వణికిపోలేదు. పాము మీద కోపానికి వచ్చాడు. నన్నే కరుస్తావా అంటూ ఆగ్రహంతో ఆ పామును పట్టుకుని గట్టిగా కరిచేశాడు. దీంతో పాపం ఆ పాము చచ్చి ఊరుకుంది. 

వివరాల్లోకి వెడితే.. జాజ్ పూర్ జిల్లాలోని గంభారిపాటియా గ్రామానికి చెందిన కిషోర్ బద్ర (45) గిరిజన రైతు.  బుధవారం రాత్రి పొలం పనులు ముగించుకుని.. పొలం నుంచి ఇంటికి వస్తున్నాడు. ఇంతలో కొద్ది దూరం వచ్చేసరికి అతని కాలికి ఏదో గుచ్చుకున్నట్టు అయ్యింది. చూస్తే ఏదో కరిచినట్టు ఉంది. 

దీంతో చేతిలోని టార్చ్ లైట్ వేసి చుట్టు పక్కల చూశాడు. తనను కరిచింది పాము అని అర్థమ్యింది. అది కూడా విషపూరితమైన సర్పం అని గుర్తించాడు. అంతే కోపంతో ఊగిపోయాడు. ప్రతీకారంతో చెలరేగిపోయాడు. పామును పట్టుకుని కొరకడం మొదలు పెట్టాడు. కోపం తీరేదాకా దాన్ని కొరికి, కొరికి వదిలిపెట్టాడు. 

ఈ చర్యకు పాపం పాపం బిత్తరపోయి ఉండొచ్చు. కానీ దానికంతగా తేరుకునే ఛాన్స్ ఇవ్వకుండానే దాన్ని కొరికేశాడు. దాంతో అది దెబ్బకు చచ్చి ఊరుకుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పామును కరిచిన  కిషోర్ బద్రకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.  

దీంతో కిశోర్ బద్ర ఊరుకోలేదు. చచ్చిన సారీ.. సారీ.. చంపిన పామును తీసుకుని ఊర్లోకి వచ్చాడు. ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తన భార్యకు చెప్పాడు. ఆమె షాక్ తో ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఈ విషయం ఆనోటా ఈ నోటా ఊరంతా తెలిసిపోయింది. దీంతో గ్రామంలో ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios