భోపాల్: మూఢ విశ్వాసంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తన భార్యను బలి ఇచ్చాడు. తన పిల్లల ముందే భార్య తల నరికి దైవానికి బలి ఇచ్చాడు. శవాన్ని పూజాగదిలో పాతిపెట్టాడు. 

ఆ ఘటనపై ఆమె ఇద్దరు కుమారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రోలీలో ఓ 50 ఏళ్ల వయస్సు గల వ్యక్తి  దేవతకు బలులు ఇస్తే సిరిసిపిందలు కలుగుతాయని విశ్వసిస్తూ వచ్చాడు. 

దాంతో తొలుత ఓ మేకను బలి ఇచ్చి, దాన్ని పూజగదిలో పాతిపెట్టాడు. ఆ తర్వాత తన భార్యనే బలి ఇచ్చాడు. ఆమె శవాన్ని కూడా పూజ గదిలో పెట్టాడు. ఈ విషయం తెలిసి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 

బ్రజేష్ కేవాత్ తన ఇద్దరు పిల్లలు మనోజ్, సురేంద్ర ముందే తలను, మొండేన్ని వేర్వేరుగా పూజాగదిలో పూడ్చి పెట్టాడు. ఆ తర్వాత అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతన్ని పట్టుకున్నారు. 

భార్యను అర్థరాత్రి చంపుతుండగా ఇద్దరు పిల్లలు లేచారు. దాంతో వారిని అతను బెదిరించాడు. పిల్లలు పారిపోయి ఆ విషయాన్ని స్థానికులకు చెప్పారు.