Asianet News TeluguAsianet News Telugu

స్నేహితుడిని చంపి మొండాన్ని ఇంట్లో దాచాడు.. ఆ తలను ఏం చేశాడంటే..

ఒకరోజు సందీప్ మందు పార్టీ అని చెప్పి ప్రమోద్ అని పిలిచాడు. ఇద్దరి మధ్య గొడవలు ఉండకూడదని, ఇక మంచిగా... స్నేహితులుగా ఉందామని చెప్పి.. ప్రమోద్ ని బాగా తాగించాడు. మైకం బాగా ఎక్కిన ప్రమోద్ అక్కడే నిద్రపోయాడు.  ఆ తర్వాత సందీప్ తన దగ్గరున్న పెద్ద కత్తితో ప్రమోద్ తల నరికేశాడు.

man beheades co worker in workplace disupute in uttarpradesh
Author
Hyderabad, First Published Dec 8, 2021, 10:28 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఉత్తరప్రదేశ్ : అసూయ, కోపం మనిషిని వినాశనం వైపుకు తీసుకెళ్తాయి. ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన ఒక దారుణమైన ఘటన దీనికి ఉదాహరణ. రోజూ పని విషయంలో గొడవ చేస్తున్నాడని తన తోటి ఉద్యోగిని దారుణంగా హత్యచేశాడు ఓ వ్యక్తి. కానీ అతడి శవాన్ని మాయం చేసేందుకు చేసిన ప్రయత్నంలో విఫలం అయి దొరికిపోయాడు.

వివరాల్లోకి వెళితే..  Uttar Pradeshలోని ఘజియాబాద్ నగరంలో ఒక ఫ్యాక్టరీలో ఇద్దరు వ్యక్తులు సందీప్, ప్రమోద్ Machine Operatorsగా పని చేస్తున్నారు.  తరచూ  మెషీన్ పాడై పోవడంతో  వారిద్దరి మధ్య గొడవ జరిగేది. మెషిన్ దుస్థితికి సందీప్ నిర్లక్ష్యమే కారణమని ప్రమోద్ యాజమాన్యానికి ప్రతిసారీ చెప్పేవాడు.  దీంతో సందీప్,  ప్రమోద్ మధ్య conflict మొదలైంది. 

వారిద్దరూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకునేవారు.  తన మీద ప్రమోద్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో సందీప్ కోపానికి వచ్చాడు.  ప్రమోద్ ని ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. సందీప్, ప్రమోద్ ఇద్దరూ Factory సమీపంలో నివసించే వారు.  ప్రమోద్ తన భార్యతో ఉంటుండగా... సందీప్ ఒంటరిగా ఉండేవాడు. 

రెండున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం.. 28 రోజుల్లోనే వలసకార్మికుడికి మరణశిక్ష..

ఒకరోజు సందీప్ liquor party అని చెప్పి ప్రమోద్ అని పిలిచాడు. ఇద్దరి మధ్య గొడవలు ఉండకూడదని, ఇక మంచిగా... స్నేహితులుగా ఉందామని చెప్పి.. ప్రమోద్ ని బాగా తాగించాడు. మైకం బాగా ఎక్కిన ప్రమోద్ అక్కడే నిద్రపోయాడు.  ఆ తర్వాత సందీప్ తన దగ్గరున్న పెద్ద కత్తితో ప్రమోద్ head నరికేశాడు. శవాన్ని ఒక పెట్టెలో దాచి.. తలను ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న చెత్తకుండీలో పారేశాడు.

మరుసటి రోజు ప్రమోద్ ఇంటికి రాకపోవడంతో అతని భార్య ఫ్యాక్టరీ వద్దకు వచ్చి ప్రమోద్ గురించి అడిగింది. అక్కడున్న తోటి కార్మికులు సందీప్, ప్రమోద్ ఇద్దరూ ఆ రోజు డ్యూటీకి రాలేదని తెలుసుకుని సందీప్ ఇంటికి వెళ్ళింది. అక్కడ సందీప్ తన ఇంటికి తాళం వేసి బయటకు వెళుతున్నాడు. ప్రమోద్ భార్య అతడిని తన భర్త గురించి ప్రశ్నించింది. దానికి అతడు సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో... ఆమెకు సందీప్ పై అనుమానం వచ్చింది.

రైతు ఉద్య‌మంపై నేడు ఎస్‌కేఏం ఏం నిర్ణ‌యం తీసుకోనుంది?

ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులను  పిలిపించి సందీప్ ఇంటి తాళం పగలకొట్టి  అక్కడ వెతికింది. సందీప్ ఇంట్లో.. వాళ్ళకు ఒక తల లేని శవం దొరికింది. అది ప్రమోద్ ది అని అతని భార్య గుర్తించడంతో వారంతా పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు అక్కడికి రాకముందే బైటికి వెళ్లిన సందీప్ అక్కడికి చేరుకున్నాడు.  దీంతో వారంతా అతడిని చితక్కొట్టి.. కట్టిపడేశారు.  ఇంతలో పోలీసులు వచ్చి సందీప్ ని అరెస్టు చేసి విచారణ చేయగా... ప్రమోద్ తలను చెత్తకుండీలో పారవేసానని సందీప్ ఒప్పుకున్నాడు.  పోలీసులు సందీప్ పై హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. 

Follow Us:
Download App:
  • android
  • ios