Asianet News TeluguAsianet News Telugu

దారుణం : సిగరెట్ ఇవ్వలేదని.. ఇద్దరిపై దాడి, ఒకరు మృతి..

సిగరెట్ అడిగితే లేదన్నారని ఓ వ్యక్తి ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. 

man beats 2 for refusing to give cigarette, 1 dead, 1 seriouly injured in punjab - bsb
Author
First Published Oct 30, 2023, 9:04 AM IST

పంజాబ్ : పంజాబ్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి రోడ్డు మీద వెడుతూ.. రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై కూర్చుని ఉన్న ఇద్దరిని సిగరెట్ కావాలని అడిగాడు. వారు తమ దగ్గర లేదని చెప్పారు. దీంతో కోపానికి వచ్చిన అతను వారిమీద విచక్షణారహితంగా దాడికి దిగాడు. నిందితుడు ఇద్దరిలో ఓ వ్యక్తి తలపై పదే పదే కొట్టాడు. దీంతో అతడు నేలపై పడ్డాడు. మరుసటి రోజు స్థానికులకు అతను శవమై కనిపించాడు.

ఈ ఘటన పంజాబ్‌లోని జలాలాబాద్‌లో వెలుగు చూసింది.  బీడీలు, సిగరెట్‌ల విషయంలో జరిగిన వివాదంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. అక్టోబర్ 28వ తేదీ అర్థరాత్రి బాధితుడు, మరో వ్యక్తి రోడ్డు పక్కన కూర్చొని ఉండగా ఈ ఘటన జరిగింది.బాధితుడితో పాటు కూర్చున్న వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం.. బీడీలు కావాలని నిందితుడు తమ వద్దకు వచ్చారని అతడు తెలిపాడు. వారు దానికి నిరాకరించడంతో వాగ్వాదం జరిగింది. వెంటనే ఎదుటి వ్యక్తి హింసాత్మకంగా మారాడు. 

విషాదం : పాము కోసం పొగబెడితే, ఇల్లు మొత్తం కాలిపోయింది..

నిందితుడు వీరిద్దరిలో పమ్మా అనే వ్యక్తి తలపై పదే పదే కొట్టి నేలపై పడేలా చేశాడు. ఆ తరువాత అతను మరో వ్యక్తి మీద కూడా దాడికి దిగాడు. అతని ఎడమ కన్ను, ముక్కుపై ఇటుకతో కొట్టాడు. వారిద్దరూ సహాయం కోసం అరిచారు. వీరి అరుపులు విని నిందితుడు సంఘటనా స్థలం నుండి పారిపోయాడు.. అని పమ్మాతో ఉన్న వ్యక్తి చెప్పాడని.. పోలీసులు తెలిపారు. 

అంతేకాదు, అతను మళ్లీ వచ్చి దాడి చేస్తాడేమోనని భయపడి తాను కూడా ఘటనా స్థలం నుంచి పారిపోయానని ఆ వ్యక్తి చెప్పినట్లు తెలిపారు. కాగా, మరుసటి రోజు ఉదయం అదే స్థలంలో పమ్మ శవమై కనిపించాడు. దీనిపై సమాచారం అందడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా, జూలైలో ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో ఇలాంటి దారుణ ఘటనే వెలుగు చూసింది. సిగరెట్ తాగొద్దని వారించినందుకు ఓ యువకుడిపై హత్యయత్నం చేశాడో వ్యక్తి. సత్యసాయి జిల్లా అమరాపురం మండలం శివరంలో ఈ దారుణం వెలుగు చూసింది. 

మహంతీష్ అనే వ్యక్తిని సిగరెట్ తాగొద్దని రంగనాథ్ అనే యువకుడు వారించాడు. దీంతో కోపానికివచ్చిన మహంతీష్ రంగనాథ్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని బెంగళూరులోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios