చాలా తెలివిగా వెళ్లినప్పటికీ.. ప్రియురాలి కుటుంబానికి దొరికిపోయాడు. దీంతో.. వారు అతనిని చితకగొట్టారు. తర్వాత తెల్లారగానే.. అతనికి వారి కూతురిని ఇచ్చి పెళ్లి చేశారు.
ప్రియురాలిని చాటుమాటుగా కలుసుకోవాలని అనుకున్నాడు. రాత్రి చీకట్లో ఎవరూ చూడకుండా ప్రియురాలనికి కలవడానికి వెళ్లాడు. చాలా తెలివిగా వెళ్లినప్పటికీ.. ప్రియురాలి కుటుంబానికి దొరికిపోయాడు. దీంతో.. వారు అతనిని చితకగొట్టారు. తర్వాత తెల్లారగానే.. అతనికి వారి కూతురిని ఇచ్చి పెళ్లి చేశారు.
ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దిరోజుల క్రితం అజిమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుమలి నగర్‌కు చెందిన ఓ యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు అర్థరాత్రి పూట ఆమె ఇంటికి వెళ్లాడు.
ఈ నేపథ్యంలో ప్రియురాలి కుటుంబసభ్యులకు దొరికిపోయాడు. అతడ్ని ఓ రూంలో బంధించి రాత్రంతా చితకబాదారు వారు. తెల్లవారుజామున పోలీసులకు అప్పంగించారు. అయితే పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై అబ్బాయి, అమ్మాయి తరపు పెద్దలు పంచాయితీ పెట్టారు. ఆ ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఆ ఉదయమే వారిద్దరికి పెళ్లి జరిపించారు. కాగా.. వాళ్లు చేసిన పనికి పాపం ఆ పిల్లాడు షాకైపోయాడు. అప్పుడేపెళ్లి వద్దు అంటే.. మళ్లీ ఎక్కడ చితకబాదుతారో అనే భయంతో.. వెంటనే తాళి కట్టేశాడు. కాగా.. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 23, 2020, 2:09 PM IST