పెంపుడు కుక్కలంటే చాలామందికి ప్రాణం. దానిమీది ప్రేమతో ఒక్కోసారి విచక్షణ కోల్పోతుంటారు. అలాంటి ఘటనే జరిగింది కేరళలో.. కుక్క కోసం మనిషి ప్రాణాలు తీశాడో వ్యక్తి. 

కేరళ : పెంపుడు కుక్కకంటే మనిషి ప్రాణాలు తక్కువగా కనిపించాయి.. అతనికి.. దానిమీది ప్రేమ.. అతడిని రాక్షసుడిని చేసింది. విచక్షణ మరిచిపోయి హంతకుడిగా మారేలా చేసింది. తన పెంపుడు కుక్కకి ఆహారం పెట్టడం విషయంలో ఆలస్యం చేసాడనే కోపంతో ఓ యువకుడు తనకు వరుసకు సోదరుడు అయ్యే బంధువును కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన కేరళలోని పాలక్కడ్ లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కాగా నిందితుడు హాకీంను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

హకీం ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని పోలీసులు తెలిపారు. హాకీంతో పాటు అతని బంధువు అర్షద్(21) కూడా అక్కడే ఉంటున్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో తన కుక్కకి ఆహారం అందించే విషయంలో ఆలస్యం చేశాడని అతనిపై హకీమ్ గురువారం దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన అర్షద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కొడుకును కరిచిందని.. కొట్టి చంపాడు.. పెంపుడు కుక్కపై యజమాని అమానుషం...

ఇదిలా ఉండగా, ఆగస్ట్ లో పెంపుడుకుక్కకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయ్యింది. పెట్ డాగ్స్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా చిన్నారులు ఈ వీడియోలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అవి చేసే చిలిపి అల్లరి, పిల్లల్ని బాధ్యతగా చూసుకునే విధానం, తోటి జంతువులతో సరదా పోట్లాటలు.. ప్రతీ ఒక్కటీ అడోరబుల్ గా ఉంటాయి. అందుకే పెట్ డాగ్స్ వీడియోలు అనగానే వ్యూస్ వేలల్లో ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేసింది. 

ఓ చిన్నారికి ఓ పెంపుడు కుక్క ఉంది. దాన్ని ముద్దు చేయడం, గారాబం చేయడం.. ఆడుకోవడం మామూలే.. అదే ఆ చిన్నారి కూడా చేసింది. అయితే.. ఆ చిన్నారితో ఆ కుక్క ప్రవర్తించిన తీరే ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీటికి మన భాష, మనసు ఇంత బాగా అర్థం అవుతాయా అంటూ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ చిన్నారి తన పెంపుడు కుక్కతో దాగుడుమూతలు ఆడాలనుకుంది. అది కూడా తోటి స్నేహితులతో ఆడుకున్నట్టుగా.. 

అందుకే ముందుగా దానికి దాగుడుమూతలు ఎలా ఆడాలో చెప్పింది. అంతా ఆ బుజ్జికుక్క కూడా చక్కగా విన్నది. చిన్నారి వెళ్లి లెక్కపెట్టూ.. అనగానే.. వెనక్కి పరిగెత్తి గోడకు రెండు కాళ్లు ఎత్తిపెట్టి.. కళ్లు మూసుకుని.. అంకెలు లెక్కపెట్టే ఫోజులో నిలబడింది. ఈ సమయంలో చిన్నారి వెళ్లి గదిలో దాక్కుంది. దాక్కోవడం అయిన తరువాత లోపల్నుంచి ఇంక పట్టుకో.. అన్నట్టుగా చెప్పింది. ఆమె మాట వినగానే అప్పటివరకు కళ్లు మూసుకున్న శునకరాజం వెంటనే వెనక్కి తిరిగి.. ఆమెను కనిపెట్టేందుకు గదిలో దూరింది. 

అంత చక్కగా చిన్నారి సూచనలు వినడం... అచ్చం మనిషిలా బిహేవ్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ కుక్క పేరు మంకీ అని వీడియోలోని ఆ చిట్టితల్లి మాటల్లో తెలుస్తోంది. వీడియో మీద కూడా మంకీ అని వాటర్ మార్క్ వేశారు. ఈ వీడియోను తీసినవారు తరువాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది వెంటనే దీనికి వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. 

ఈ వీడియో చూసినవారు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘దాగుడుమూతలు ఆడడానికి ఇంతకంటే మంచి ఫ్రెండ్ ఉండదు’.. అని ఒకరంటే.. ‘ఆ అమ్మాయి చెప్పినట్టుగానే వింటుందంటే.. ఆ అమ్మాయిని పట్టుకోవడానికి కాస్త ఆలస్యం చేసి.. చిన్నారిని సంతోషపెడుతుంది’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘మా ఇంట్లో కూడా ఇలాంటి కుక్కే ఉండేది. నేనూ దాంతో దాగుడుమూతలు ఆడేదాన్ని. అవి బాగా ఆడతాయి’ అని మరొకరు తమ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు.