కొడెర్మా: ఓ వ్యక్తి తన కుటుంబానికి చెందిన ఐదుగురిని నరికి చంపాడు. ఈ సంఘటన బుధవారంనాడు జార్ఖండ్ లోని కొడెర్మా జిల్లాలో జరిగింది. గాంగో దాస్ అనే వ్యక్తి తన 50 ఏళ్ల వయస్సు గల తల్లిని, 30 ఏళ్ల భార్యను, కుమారుడిని, ఇద్దరు కూతుళ్లను నరికి చంపాడు. 

భార్య గర్భవతి కూడా. ఈ సంఘటన జార్ఖండ్ లోని మాస్మోహన గ్రామంలో బుధవారం తెల్లవారు జామున 2 గంటలకు జరిగిందని కొడెర్మా సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ (ఎస్డీపిఓ) రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.

దాస్ కు మతిస్థిమితం లేదని, అతన్ని ఆస్పత్రిలో చేర్చామని ఆయన చెప్పారు నిందితుడిని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

ఆ సంఘటనలో దాస్ కుటుంబ సభ్యుల్లో ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.