Asianet News TeluguAsianet News Telugu

పట్టపగలు నడిరోడ్డులో మహిళపై దారుణం.. వేట కొడవలితో..  

కేరళలోని కొచ్చిలో శనివారం ఉదయం ఓ వ్యక్తి రోడ్డుపై మహిళపై కత్తితో దాడి చేశాడు. కాలూరులోని ఆజాద్ రోడ్డులో ఉదయం 11 గంటల ప్రాంతంలో  ఓ యువకుడికి, ఇద్దరు మహిళలకు మధ్య వాగ్వాదం జరగడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Man Attacks Woman With Machete On Road In Kerala, Manages To Escape
Author
First Published Dec 3, 2022, 4:26 PM IST

నానాటికీ సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఓ వ్యక్తి పట్టపగలే నడిరోడ్డుపై వేట కొడవలితో మహిళపై విచక్షణరహితంగా  దాడి చేశారు. ఆమె తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన కేరళలోని  కొచ్చిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన కలూర్‌లోని ఆజాద్ రోడ్‌లో ఉదయం 11 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.

ప్రత్యేక్ష సాక్షుల ప్రకారం.. ఒక యువకుడు, ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదం గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో ఆ యువకుడు మహిళల్లో ఒకరి తలపై తనతో తెచ్చుకున్న వేట కొడవలితో  కొట్టేందుకు ప్రయత్నించాడని, అయితే .. ఆమె స్నేహితురాలి దాడిని అడ్డుకోగలిగింది. ఈ దాడిలో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. ఈ అనంతరం ఆ నిందితుడు తన బైకును అక్కడే వదిలి పారిపోయాడు.గాయపడిన మహిళను ఆసుపత్రిలో చేర్చారు. ఘటనకు సంబంధించిన వీడియోలో సమీపంలో రక్తం, కత్తి పడి ఉన్నాయి. కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios