నిండు గర్బిణీ అయిన భార్య ముందే భర్త మీద కత్తులతో దాడి చేశారు. నిందితులు.. అడ్డువచ్చిన భార్యనూ కొట్టారు. దాడిలో తీవ్రంగా గాయపడిన భర్త అక్కడికక్కడే చనిపోయాడు.
ఉదయ్‌పూర్ : Rajasthanలోని ఉదయపూర్ జిల్లాలో దారుణం జరిగింది. సోమవారం నాడు 27 ఏళ్ల వ్యక్తిని.. అతని గర్భిణీ భార్య ఇతరుల ముందే అతని శత్రువు murder చేశాడు. మహ్మద్ ఘిజాలీ తల్లిగారింట్లో ఉణ్న భార్యను కలవడానికి సజ్జన్ నగర్‌లోని అత్తామామల ఇంటికి వెళ్లాడు.
ఈ సమయంలోనే “ప్రధాన నేరస్థుడు సద్దాంతో సహా దాదాపు అరడజను మంది సాయుధ వ్యక్తులు అక్కడికి చేరుకుని అతన్ని బయటకు పిలిచారు. బయటికి వచ్చిన అతనిమీద వారు కత్తులు, కర్రలతో దాడి చేశాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు’ అని అంబమట పోలీస్ స్టేషన్ SHO సునీల్ కుమార్ టైలర్ తెలిపారు.
భర్తను కొట్టడం చూసిన భార్య ఆయన్ని రక్షించడానికి పరుగెత్తుకువచ్చింది. దీంతో వారు అతని భార్యను కూడా కొట్టారు. వారు వెళ్లిన అనంతరం ఘిజాలీని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే అతను చనిపోయినట్లు ప్రకటించారని పోలీసులు తెలిపారు.
పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘిజాలీ, సద్దాం ఇద్దరికీ నేర నేపథ్యం ఉందని..ఒక మహిళ విషయంలో గొడవ అని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఘిజాలీ డ్రైవర్ అని, కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో సద్దాంకు ఛాలెంజ్ చేశాడని పోలీసులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని ఎస్‌హెచ్‌వో తెలిపారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. తన భార్యను హత్య చేసి శవాన్ని ఇంట్లోని బాత్రూంలో దాచాడు. ఢిల్లీలోని కపిల్ విహార్‌కు చెందిన విజయ్ (38) జూన్ 18న తన భార్యను హత్య చేసినట్లు భల్స్వా డెయిరీ పోలీస్ స్టేషన్‌లో అధికారులకు సమాచారం అందించాడు. విచారణ అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలు సంతోషిదేవిని భర్త గుడ్డలో చుట్టి ఉంచినట్లు గుర్తించారు.
వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విజయ్‌కి ఇంతకు ముందు మరో మహిళతో వివాహం జరిగిందని, అతనికి నలుగురు పిల్లలు ఉన్నారని అధికారులు గుర్తించారు. అనంతరం ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న బాధితురాలితో అతనికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా వారి మధ్య ప్రేమకు దారి తీసింది. ఇది తెలిసిన వెంటనే, అతని మొదటి భార్య అతని నుండి విడిపోయింది. మృతురాలు సంతోషికి నలుగురు పిల్లలు, 14, 13, 12 ఏళ్ల ముగ్గురు అమ్మాయిలు, 8 ఏళ్ల అబ్బాయి ఉన్నారు. ఆమె కూడా భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది.
దీంతో భార్య విడిపోవడంతో విజయ్, సంతోషి సహజీవనం చేయడం ప్రారంభించారు. వీరికి ఒక బిడ్డ కూడా ఉంది. కాలక్రమేణా, పిల్లలందరి సంరక్షణకు సంబంధించిన విషయంలో విజయ్, సంతోషి మధ్య కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి. జూన్ 17 సాయంత్రం, సంతోషి పని నుండి తిరిగి వచ్చాడు. రాత్రి 11.30 గంటల సమయంలో, మళ్లీ గొడవ జరిగింది. పిల్లలందరూ గ్రౌండ్ ఫ్లోర్‌లో నిద్రపోతున్నారు. విజయ్, సంతోషి పై అంతస్తులో ఉన్నారు.
గొడవ ఎంతకీ ముగింపుకు రాకపోవడం.. పదే పదే గొడవలు రిపీట్ అవుతుండడంతో నిందితుడు కోపంతో సంతోషిని గొంతు నులిమి చంపేశాడు. ఆ తరువాత అనుమానం రాకుండా మృతదేహాన్ని ఎక్కడైనా మాయం చేయాలనుకున్నాడు. దీనికోసం మృతదేహాన్ని గుడ్డలో చుట్టాడు. ఆ తరువాత ఎవ్వరూ చూడకుండా పారవేద్దామనుకున్నాడు. కానీ, అతను ఆ పని చేయలేకపోయాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక.. జూన్ 18 రాత్రి 8.45 గంటల ప్రాంతంలో పోలీసులను ఆశ్రయించాడు. తన నేరాన్ని అంగీకరించాడు.
