Asianet News TeluguAsianet News Telugu

కట్నం కోసం కూతురికి వేధింపులు.. అల్లుడ్ని స్తంభానికి కట్టేసి చితకబాదారు..

ఒరిస్సాలో వరకట్న వేధింపులకు పాల్పడుతున్న ఓ అల్లుడికి అత్తింటివారు దేహశుద్ది చేశారు. ఒరిస్సా, కొరాపుట్‌ జిల్లా సెమిలిగుడ సమితిలోని మాలిగొంజ గ్రామంలో  అత్తింటి వారు అల్లుడిని స్థంబానికి కట్టి చితకబాదారు. 

man attacked and beaten to death by wifes family members in orissa over dowry harassment - bsb
Author
Hyderabad, First Published Feb 24, 2021, 10:07 AM IST

ఒరిస్సాలో వరకట్న వేధింపులకు పాల్పడుతున్న ఓ అల్లుడికి అత్తింటివారు దేహశుద్ది చేశారు. ఒరిస్సా, కొరాపుట్‌ జిల్లా సెమిలిగుడ సమితిలోని మాలిగొంజ గ్రామంలో  అత్తింటి వారు అల్లుడిని స్థంబానికి కట్టి చితకబాదారు. 

తాగిన మైకంలో అల్లుడు తన కుమార్తెను వేధిస్తున్నడని తెలుసుకున్న అత్తింటివారు ఆగ్రహంతో ఊగిపోయారు. మంగళవారం అల్లుడిని తమ గ్రామానికి తీసుకువచ్చారు. గ్రామం మధ్యలో ఉన్న కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుండడంతో పొట్టంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

అప్పటికే స్పృహ తప్పి పడిపోయిన ఆ యువకుడిని పోలీసులు రక్షించారు. ఆ తరువాత అతడ్ని పొట్టంగి హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడ్నుంచి కొరాపుట్‌లోని సహిద్‌ లక్ష్మణ నాయక్‌  వైద్య కళాశాల హాస్పిటల్ లో చేర్చారు. 

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం... సెమిలిగుడ సమితిలోని మాలిమొరియా గ్రామానికి చెందిన యువకుడు లొఖి ఖొర, మాలిగొంజ గ్రామానికి చెందిన ధనేశ్వర గొలారిని ప్రేమించాడు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వివాహమైన కొన్నాళ్లకు కట్నం తీసుకు రమ్మని భార్యను వేధిస్తూ కొట్టడం మొదలుపెట్టాడు. 

అంతేకాదు సోమవారం నాడు మీ పుట్టింట్లో వదిలేస్తాను పదా అంటూ ఆమెను తీసుకుని మాలిగొంజకు బయల్దేరాడు. దార్లోనే ఆమెను అమానుషంగా కొట్టి, అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయాడు. 

ఈ విషయం తెలిసిన యువతి కుటుంబసభ్యులు వెంటనే వచ్చి దార్లో పడున్న ధనేశ్వరిని ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. ఆ తరువాత కోపంతో సెమిలిగుడలో ఉన్న అల్లుడు లొఖి ఖొరను ఎత్తుకొచ్చారు. మాలిగొంజి గ్రామంలో విద్యుత్‌ స్తంభానికి కట్టి చితకబాదారు. 

ఈ సంఘటనపై ధనేశ్వరి, లొఖి ఖొర కుటుంబ సభ్యులు పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios