రెండొందల రూపాయలకోసం మనిషి ప్రాణాలు తీసిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. అలీగడ్ లో ఓ వ్యక్తిని రూ. 200 అప్పు ఇవ్వమని అడిగితే ఇవ్వనందుకు నాటు తుపాకీతో కాల్చి చంపేశాడో దుండగుడు.

వివరాల్లోకి వెడితే ఉత్తర్ ప్రదేశ్, అలీగఢ్ లోని స్థానిక షంషాద్ మార్కెట్ లో అన్స్ అహ్మద్ దుకాణం నడుపుతున్నాడు. శనివారం ఇతని దగ్గరికి అసిఫ్ అనే వ్యక్తి వచ్చాడు. రూ. 200 అప్పు ఇవ్వమని అడిగాడు. దీనికి అహ్మద్ ఒప్పుకోలేదు.

అసిఫ్ ఎంత సేపు అడిగినా అహ్మద్ ఒప్పుకోకపోవడంతో కోపానికొచ్చాడు. తన దగ్గరున్న నాటు తుపాకీతో అహ్మద్ తలపై కాల్చాడు. దీంతో అహ్మద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనుకోని ఘటనకు షాకైన చుట్టుపక్కల వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.