తమిళనాడులో ఓ కీచకుడు స్వయానా తమ్ముడి భార్య మీద కన్నేశాడు. తమ్ముడు లేని సమయంలో ఆమె మీద బలవంతం చేయబోయాడు. దీనికి ఆమె అంగీకరించలేదని.. గర్భిణి అని కూడా చూడకుండా ఆమెతో సహా రెండేళ్ల కూతురిని దారుణంగా హత్య చేశాడు.  

తమిళనాడు : Tamilanaduలోని తిరువొత్తియూరులో దారుణం జరిగింది. తన కోరిక తీర్చలేదని తమ్ముడి భార్యను దారుణంగా హత్యచేసి దహనం చేశాడో కిరాతకుడు. ఆమెతో పాటు రెండేళ్ల చిన్నారినీ హత్య చేసి కాల్చేశాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. దిండుక్కల్ జిల్లా నత్తం సమీపంలోని మలయనూర్ ప్రాంతానికి చెందిన నల్లపిచ్చన్ కుమారులు karuppaiya (30), శివకుమార్ (27). వీరిలో కరుప్పయ్యకు వివాహం కాలేదు. శివ కుమార్ కు anjali (21)తో వివాహం జరిగింది. వీరికి మలర్ (2) కుమార్తె ఉంది. కాగా ప్రస్తుతం అంజలి నాలుగు నెలల గర్భిణీ.

ఇదిలా ఉండగా.. శనివారం శివకుమార్ చింతపండు వ్యాపారం కోసం బయటి ఊరికి వెళ్ళాడు. సాయంత్రం సమయంలో అదే ప్రాంతంలో ఉన్న తోటలో చిన్నారి మలర్ వితితో కలిసి anjali మేకలు కాస్తూ ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కరుప్పయ్య ఒంటరిగా ఉన్న అంజలిని చూసి తన కోరిక తీర్చమని ఒత్తిడి చేశాడు. దీనికి అంజలి తిరస్కరించడంతో కరుప్పయ్య కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. తరువాత బిడ్డ మలర్ విలిని కూడా అతను నరికి హత్య చేశాడు. 

తర్వాత ఇద్దరి మృతదేహాలకు నిప్పు పెట్టి పారిపోయాడు. మంటలతో పొగ అలుముకుంది. అది చుట్టు పక్కల ప్రాంతాలకు కూడా కనిపించసాగింది. దీంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూశారు. ఇద్దరు మృతదేహాలు కాలిపోతున్నట్లు గుర్తించి ..పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు కరుప్పయ్యను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 

ఇదిలా ఉండగా, తమిళనాడులోనే మార్చి 30న ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బతికుండగానే wifeను పూడ్చి పెట్టాడు ఓ కిరాతక భర్త. ఈ దారుణ ఉదంతానికి సంబంధించి నిందితుడుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు arrest చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. tamilnadu వేలూరు సమీపంలోని కాట్పాడి వడుకన్ తాంగల్ కు చెందిన వినాయకం.. ప్రైవేటు ఉద్యోగి. గుడియాత్తం నివాసి suprajaను (25) ప్రేమించి నాలుగేళ్ల కిందట పెళ్ళాడాడు. దంపతులు కేవీ కుప్పం సమీపంలోని మడినాంపట్టులో నివాసముంటున్నారు. వారికి ఏడాదిన్నర పాప కూడా ఉంది. 2 నెలల క్రితం సుప్రజ అనారోగ్యానికి గురయ్యింది. అప్పుడు wife and husband మధ్య గొడవలు జరిగాయి. భార్యను వినాయకం తీవ్రంగా కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయింది.

అయితే, ఆమె చనిపోయిందని భావించిన వినాయకం వెంటనే తన తమ్ముడు విజయ్, స్నేహితుడు శివకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించాడు. శుక్రవారం అర్ధరాత్రి కవసంబట్టు చక్కెర తోపు అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సజీవంగా పాతిపెట్టారు. సుప్రజ కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ సెంథిల్ కుమారి కేసు నమోదు చేశారు. నిందితులను మంగళవారం అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. సుప్రజ మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు చర్యలు చేపట్టారు.