అతను మాములు వ్యక్తి కాదు. చోరీలో ఆరితేరాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 150కార్లు చోరీ చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన తమిళనాడు  రాష్ట్రంలో చోటుచేసుకుంది.

తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా 150కార్లు అపహరించి.. వాటిని వేరే వాళ్లకి అమ్మేసేవాడు. ఆ వచ్చిన డబ్బుతో లగ్జరీ జీవితం గడేపేస్తున్నాడు. కాగా అనుకోకుండా పోలీసులకు చిక్కడంతో అతని విషయం వెలుగులోకి వచ్చింది. కోయంబత్తూరు జిల్లా సూలూరు ప్రాంతంలో పోలీసులు గస్తీ తిరుగుతుండగా ఆ మార్గంలో అనుమా నాస్పదంగా బైక్‌లో వచ్చిన వ్యక్తిని అదు పులోకి తీసుకునని విచారించారు. 

వ్యాస ర్పాడికి చెందిన పరమేశ్వరన్‌ ప్రస్తుతం మదురైలో ఉంటున్నట్టు తెలిసింది. రాష్ట్రం లోని పలు జిల్లాల సహా కర్నాటక, ఆంధ్రా, కేరళ, మహారాష్ట్రల్లో సుమారు 150కి పైగా లగ్జరీ కార్లను అపహరించి లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నట్లు పోలీ సుల విచారణలో తెలిసింది. ఇప్పటికే ఇతనిపై 200 పైగా కేసులు ఉన్నాయి. 

అంతేకాకుండా లగ్జరీ కారు అద్దాలను బద్దలు కొట్టి అందులోని నగదు, విలువైన వస్తువులను చోరీచేసి పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నట్లు పోలీసుల విచా రణలో తెలిసింది. అతనిని అరెస్టుచేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరు పరిచి ముమ్మర విచారణ నిమిత్తం జైలుకు తరలించారు.