పక్కింటి మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా చూసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.
బెంగళూరు : పక్కింటి మహిళ స్నానం చేస్తుండగా ఇంటి కిటికీలోంచి చూసిన 23 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. నిందితుడు ఎన్. నితిన్ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి. గృహిణి అయిన 38 ఏళ్ల వినుత (మారుపేరు) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.
తన ఇంటి పనులు ముగించుకుని మధ్యాహ్నం 1.35 గంటలకు వాష్‌రూమ్‌కు వెళ్లినట్లు వినుత పోలీసులకు తెలిపింది. కిటికీలోంచి ఎవరో చూడటం గమనించి సహాయం కోసం అరిచింది.నిందితుడు వెంటనే అక్కడినుంచి పారిపోయాడు. అయితే అతను తన పొరుగింటి నితిన్ అని ఆమె పోలీసులకు చెప్పింది.
ఆ తర్వాత నితిన్‌ను ప్రశ్నించేందుకు వినుత తన బావ, ఇతరులతో కలిసి అతని నివాసానికి వెళ్లింది. వారు అతనిని తీవ్రంగా కొట్టడంతో అతను తన నేరాన్ని అంగీకరించాడు.
జైలులో ఉన్న భర్తకు బెయిల్ ఇప్పించిన భార్య.. బైటికొచ్చి అనుమానంతో ఆమెను కాల్చి చంపి..
ఇదిలా ఉండగా, విజయవాడలో ఇలాంటి ఘోరమే వెలుగు చూసింది. ఓ మహిళను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడుతున్న నిందితుడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. సదరు మహిళా స్నానం చేస్తుండగా నిందితుడు దొంగచాటుగా ఫోటోలు తీశాడు. ఆ తర్వాత వాటిని చూపిస్తూ ఆమె మీద బెదిరింపులకు పాల్పడ్డాడు. తను చెప్పినట్టుగా వినకపోతే ఫోటోలను వైరల్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేశాడు. ఆ తర్వాత ఆమె మీద పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
నగ్న ఫోటోలను అడ్డుపెట్టుకుని ఆమె దగ్గర నుంచి లక్షల రూపాయలు తీసుకున్నాడు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆమె అడిగింది. దీంతో ఆమె మీద దాడికి దిగాడు. రోజురోజుకు అతని వేధింపులు ఎక్కువ అవుతుండడంతో తన కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విజయవాడ నగరం నున్న పోలీసులు నిందితుడి మీద కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి సిఐ కాగిత శ్రీనివాసరావు ఈ మేరకు వివరాలు తెలిపారు..
నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని విశాలాంధ్ర కాలనీకి చెందిన పుట్ట సుభాష్ (45) నిందితుడు. అతను బిపిసిఎల్ కంపెనీలో పైప్ లైన్ సెట్టింగ్ చేసే పనులు చేస్తుంటాడు. విజయవాడ రాజీవ్ నగర్ కు చెందిన ఓ మహిళ (35).. భర్తతో కలిసి కిరాణం దుకాణం నడుపుతుంది. ఇటీవలి కాలంలో నగదు లావాదేవీలన్నీ ఫోన్ పే, పేటీఎంల ద్వారానే జరుగుతున్న క్రమంలో.. నిందితుడు సుభాష్ తరచుగా ఆ దుకాణంలో సరుకులు కొనుగోలు చేసేవాడు.
ఆ సమయంలో డబ్బులు కట్టడం కోసం ఫోన్ పే,పేటీఎంలు వాడుతూ.. ఆ మహిళ ఫోన్ నెంబర్ను ఎలాగో సంపాదించాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆమెతో మాటలు కలిపాడు. ఈ క్రమంలో ఒకసారి ఆమె రాజీవ్ నగర్ లోని తన ఇంట్లో స్నానం చేస్తుండగా.. అతను దొంగ చాటుగా ఫోటోలు తీశాడు. ఆ తర్వాత అవి చూపిస్తూ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.
తను చెప్పినట్లు వినకపోతే వేరే వాళ్లకు ఫోటోలు చూపిస్తానని బెదిరింపులకు దిగాడు. ఆమె ఎంత ప్రతీఘటించినా వినకుండా ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి ఆమెను బెదిరించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడితో అతడి పైశాచికానందం తీరలేదు. ఆ ఫోటోలను చూపించి ఆమెను బెదిరిస్తూ 16 లక్షల రూపాయల వరకు తీసుకున్నాడు. కొద్ది కాలం తర్వాత నా డబ్బులు నాకు ఇచ్చేయమని ఆమె అడిగితే కొట్టాడు.
ఏడాదిగా తన మీద జరుగుతున్న అత్యాచారం, ఇప్పుడు దాడితో ఆమె తట్టుకోలేకపోయింది. ఏదైతే అది అయిందని విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సహాయంతో బుధవారం సుభాష్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరిచారు. నిందితుడైన సుభాష్ కు కోర్టు రిమాండ్ విధించినట్లుగా పోలీసులు తెలిపారు.
