Asianet News TeluguAsianet News Telugu

4,200 స్మార్ట్ ఫోన్లు చోరీ... పోలీసుల అదుపులో ఘరానా దొంగ

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 4,200 స్మర్ట్స్ ఫోన్లను దొంగిలించిన ఓ ఘరానా దొంగన డిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ  మొబైల్స్ అన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పోన్ల విలువ దాదాపు రూ.87 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Man arrested for stealing Xiaomi phones worth over Rs. 87 lakhs from Delhi
Author
Delhi, First Published Aug 27, 2018, 4:22 PM IST

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 4,200 స్మర్ట్స్ ఫోన్లను దొంగిలించిన ఓ ఘరానా దొంగన డిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ  మొబైల్స్ అన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పోన్ల విలువ దాదాపు రూ.87 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే...డిల్లీ శివారులోని గుర్‌గావ్ ప్రాంతంలో ఇటీవల షియోమీ కంపనీ పోన్లను భద్రపరిచే గోడౌన్ కుప్పకూలింది. ఈ సమయంలో అక్కడే వున్న బీహార్ ప్రాంతానికి చెందిన రమేష్ ఆ శిథిలాల్లో పడివున్న ఫోన్లను అందింనకాడికి దోచుకున్నాడు. ఈ దోపిడీలో తన ముగ్గరు స్నేహితులను కూడా బాగస్వామ్యం చేశాడు. 

అయితే కూలిన గోడౌన్లో ఫోన్లు మాయమైనట్లు గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టి ఎట్టకేలకు ప్రధాన నిందితుడు రమేష్ ను అరెస్ట్ చేశారు.అతడి వద్ద నుండి మొత్తం పోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసిపి శంషేర్ సింగ్ తెలిపారు. మిగతా ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

చోరీకి గురైన స్మార్ట్ ఫోన్లలో దాదాపు రూ.5 వేల నుండి రూ.15 వేలు ధర గలవి ఉన్నాయి. మొత్తం ఫోన్ల విలువ ఇంచుమించు రూ. 87 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios