చిన్నకారణానికి విడిపోయి దూరంగా ఉంటున్న భార్యభర్తలు కక్షతో ఒకరు విగతజీవి కాగా, మరొకరు దోషిగా మారారు. భార్యను హత్యచేసి ఏమీ తెలియనట్టు బుకాయించిన సదరు భర్త చేతి గోళ్లే అతడిని పట్టించాయి.
ముంబై : wife and husband మధ్య గొడవలు సహజం. కలహాలు లేని కాపురం ఉండదు. కానీ ఆ మనస్పర్ధలు సద్దుమణిగి కలిసిపోతే అసలు సమస్యే ఉండదు. చిలికి చిలికి గాలివానలా మారితేనే కష్టం. పోనీ, ఎవరి మానాన వారు బతికినా పర్వాలేదు. కానీ ఒకరిమీద ఒకరు కక్ష పెంచుకుని.. దారుణమైన crimeకు పాల్పడితేనే.. ఇద్దరి జీవితాలూ నాశనం అవుతాయి. అలాంటి సంఘటన mumbaiలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే…ముంబైలో సకినాకాలోని ఖైరానీ రోడ్డు ప్రాంతంలో మనోజ్ ప్రజాపతి, అతని భార్య రీమా బోలా యాదవ్ నివసిస్తున్నారు. అయితే, ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. వారు గత రెండు రోజులుగా విడివిడిగా నివసించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అనుకోకుండా ఒక రోజు రీమా స్నేహితురాలు.. రీమా ఇంటికి వచ్చి చూసేటప్పటికీ ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో రీమా భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే అతను తొలుత కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ, నిందితుడి గోళ్లపై ఉన్న రక్తపు మరకలు అతన్ని పట్టుబడేలా చేశాయని పోలీసులు తెలిపారు. రీమా తన మొబైల్లో చివరిసారిగా తన భర్తతోనే సంభాషించినట్లు వెల్లడించారు. దీంతో పోలీసులు రీమా భర్తను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఓ married woman అదృశ్యమైన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట్ కు చెందిన మౌనికకు గతేడాది కొండాపూర్ కు చెందిన ధనుంజయ్ తో వివాహం అయ్యింది. నాటి నుంచి ఆమెను భర్త పుట్టింటికి పంపించలేదు. ఈ క్రమంలో మౌనిక తొమ్మిది రోజుల క్రితం తన బాబాయ్ గోపాల్ ఇంట్లో జరిగిన శుభకార్యానికి భర్తకు చెప్పకుండానే హాజరయ్యింది.
ఈ నెల 3న తన అత్తింటికి వెల్తున్నానని మౌనిక బయలుదేరింది. అదే రోజు సాయంత్రం గోపాల్ ఆమె కోసం ఆరా తీయగా ఇంటికి చేరుకోలేదని తెలిసింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పలు ప్రాంతాల్లో ఆమె జాడ కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 3న ఇలాంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. భార్యను అత్యంత దారుణంగా murder చేసిన భర్త పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయిన ఘటన Delhiలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. తుగ్లకాబాద్ ఎక్స్ టెన్షన్ ప్రాంతానికి చెందిన ఓ భర్త గురువారం ఉదయం ఢిల్లీలోని గోవింద్ పురి police stationకు వచ్చి లొంగిపోయాడు. తన భార్యను Scissorsతో పొడిచి చంపానని చెప్పి భర్త పోలీసుల ముందు లొంగిపోయాడు.
తాను ఇంట్లో ఉన్న ప్రెజర్ కుక్కర్, సిలిండర్, కత్తెరతో భార్యను చంపానని నిందితుడైన భర్త పోలీసులకు చెప్పాడు. పోలీసులు భార్య మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కత్తెర, కుక్కర్, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. భార్య దారుణ హత్య ఘటన మీద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
