విదేశీ యువతిని లైంగికంగా వేధించిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలాయ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..  

నమ్మక్కల్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తాను ఒక సాధువునని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. కాగా.. అక్కడికి వచ్చిన ఓ విదేశీ యువతి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. కాగా సదరు యువతి.. ఆలయాల సందర్శన కోసం అక్కడికి రావడం గమనార్హం.

కాగా.. అతని వేధింపులను గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు  చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేశారు.  కాగా.. అతనిని విచారిస్తున్నట్లు చెప్పారు.

సదరు యువతి ఆధ్యాత్మిక సాధన కోసం అక్కడి వసతి గృహంలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.